లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

వాహనదారులకు గుడ్ న్యూస్ : పెట్రోల్, డీజిల్ అత్యంత శుభ్రం

Published

on

World's cleanest petrol, diesel fuels India now

వాహనదారులకు గుడ్ న్యూస్. వెహికల్స్ లో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరకడం లేదని బాధ పడుతున్నారా ? అయితే..మీ బాధలు తీరినట్లే. ఎందుకంటే..చుమురు పరిశుభ్రంగా దొరకనుంది. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరికే దేశాల సరసన భారత్ చేరింది. BS 6 ప్రమణాలున్న పెట్రోల్, డీజిల్ ను దేశ వ్యాప్తంగా అన్ని బంకుల పంపుల్లోనూ విక్రయించనున్నారు.

వాటి ధరలను మాత్రం పెంచలేదని కంపెనీలు వెల్లడించాయి. ఏప్రిల్ 01వ తేదీ దేశ వ్యాప్తంగా కేవలం బీఎస్ 6 ప్రమాణాలున్న వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ..కరోనా మహమ్మారీ విజృంభిస్తున్న తరుణంలో బీఎస్ 4 వాహనాల అమ్మకాలు ఆగిపోవడం..ఏప్రిల్ 14వ తేదీ లాక్ డౌన్ అనంతరం మరో 10 రోజుల పాటు బీఎస్ 4 వాహనాలను విక్రయించుకొనేందుకు వాహన డీలర్లకు అనుమతినిచ్చింది.

అప్పటి వరకు గడువున్నా..ఏప్రిల్ 01వ తేదీ బుధవారం నుంచే బీఎస్ 6 ప్రమాణాలున్న పెట్రోల్, డీజిల్ ను దేశ వ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లోనూ విక్రయిస్తున్నారు. దీనివల్ల వాహనాల నుంచి కాలుష్యం స్థాయిలు తగ్గనున్నాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న ఇంధనంలో సల్ఫర్ స్థాయిలు కేవలం 10 పీపీఎం వరకు మాత్రమే ఉండనున్నాయి. బీఎస్ 4 ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చాక.. ఇంధనంలో సల్ఫర్ స్థాయిలు 350 పీపీఎం వరకు ఉండేవి.(మందుబాబులకు షాకిచ్చిన హైకోర్టు: మద్యం అమ్మకాలపై హైకోర్టు స్టే)

ఆ తర్వాత బీఎస్ 4 ప్రమాణాలను అమలు చేశాక..ఇంధనంలో సల్ఫర్ స్థాయిలు 50 పీపీఎంకు పడిపోయాయి. ప్రస్తుతం బీఎస్ 6 ప్రమాణాలు ఉండడం వల్ల..సల్ఫర్ స్థాయి మరింత పడిపోయి..10 పీపీఎంకు చేరుకుంది. మరోవైపు బీఎస్ 4 వాహనాల్లోనూ ఈ ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 68 వేల 700 పెట్రోల్ పంపుల్లో బుధవారం నుంచి బీఎస్ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్, డీజిల్ ను విక్రయించడం ప్రారంభించారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *