లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

మాస్క్ ఖరీదు రూ. 11.15కోట్లు

Published

on

expensive face mask:కరోనా కాలంలో మాస్క్‌లు వేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. అయితే ఇప్పుడు మాస్క్‌లు కూడా స్టేటస్‌కు సింబల్‌గా మారిపోయాయి కొందరికి. ప్రస్తుతం మాస్క్‌ లేకుండా బయటకు రాలేని పరిస్థితిలో ఆ మాస్క్‌ని కూడా కోట్లు పెట్టి ఓ ఆభరణంలా చేయించుకుంటున్నారు కొంతమంది. అయిదు, పది రూపాయల్లో వచ్చే మాస్క్‌ని అమెరికాలో నివసిస్తున్న ఓ చైనా వ్యాపారవేత్త కోట్లు పెట్టి చేయించేశాడు.
బంగారంతో ధారాలు అల్లించి, వజ్రవైడూర్యాలు పొదిగి నాలుగు నెలల పాటు కష్టపడి 270 గ్రాముల బరువుండే మాస్క్‌ని తయారు చేయించాడు ఆ వ్యాపారి. దీని ధర కూడా అదే స్థాయిలో ఉంది. దీని ధర 2.17మిలియన్ న్యూజిలాండ్ డాలర్లగా ఉంది. మన రూపాయలలో పోలిస్తే.. దాని ధర రూ.11.15 కోట్లు(11,15,02,715రూపాయలు). ఈ మాస్క్‌పై 3600 నలుపు, తెలుపు రంగు వజ్రాలను పొదిగారు. ఇంకా ఎన్-99 ఫిల్టర్‌ను అమర్చగా.. వైవెల్ జ్యువెలరీ కంపెనీ ఈ మాస్క్‌ తయారు చేసింది.

మన మెదడు.. విశ్వంలోని పాలపుంతను పోలి ఉందా?


మాస్క్ తయారీకి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి లాస్ ఏంజెల్స్‌లో ఉంటారని, పూర్తి వివరాలు వెల్లడించడానికి మాత్రం జ్యువెలరీ సంస్థ నిరాకరించింది. జెరూసలెం సమీపంలోని నగల తయారీ సంస్థ యజమాని లెవీ మాట్లాడుతూ.. కోవిడ్ కష్టకాలంలో మా ఉద్యోగులకు మాస్క్ తయారీ కోసం నాలుగు నెలల పాటు పని కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. 25 మంది నిపుణులైన పనివాళ్లు ఈ మాస్క్ తయారీలో పాల్గొన్నట్లుగా వెల్లడించారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *