Writer Jonnavithula meets Pawan Kalyan

పవన్ కళ్యాణ్‌కు రచయిత జొన్నవిత్తుల మద్దతు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు భాషాపరిరక్షణకు దృఢ దీక్షతో నిలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపిన ప్రముఖ కవి జొన్నవిత్తుల..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు కలిశారు. రాష్ట్ర రాజకీయాలలో తనదైన మార్పు కోసం అలుపెరగకుండా ప్రయత్నించడంతో పాటు, 
తెలుగు భాషాపరిరక్షణకు దృఢ దీక్షతో నిలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని ఆయన నివాసంలో కలిసి అభినందించి, తన మద్దతు తెలియచేశారు జొన్నవిత్తుల.

‘భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే భాషను బ్రతికించుకోవలసిన అవసరం ఉందని, ఒక రచయితగా మాతృ భాషపై ఉన్న మమకారంతోనే తాను పవన్‌ను కలిసి, భాషా పరిరక్షణకై ఆయన పోరాడుతున్న విధానం నచ్చి, మద్దతు తెలిపానని, కాస్త సమయం పడుతుంది కానీ ఏదైనా సాధించడం పవన్ వల్ల అవుతుంది’ అని జొన్నవిత్తుల చెప్పారు. 

బోనీ కపూర్, దిల్ రాజుల నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్‌లో పవన్ నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్వ్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.

Related Posts