లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు.. అభ్యర్థులకు సూచనలు

Published

on

written-exam-village-and-ward-secretariats1

Grama (Village) and Ward Secretariats Exam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 16 వేల 208 పోస్టులున్నాయి. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలు నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. ఉదయం పరీక్ష రాసేవారు 8 గంటల కల్లా, సాయంత్రం పరీక్ష రాసేవారు ఒంటి గంట కల్లా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి పరీక్షకు పెట్టే నిబంధన (ఒక్క నిమిషం) ఈ పరీక్షలకు కూడా వర్తింప చేయనున్నారు.
విద్యార్థులకు సూచనలు :

అభ్యర్థులకు మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు తప్పనిసరి. ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే ఐసోలేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది.
కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్‌ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూముల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తారు.

దగ్గితే చాలు కరోనా గుట్టు చెప్పేస్తోంది!


ఓఎంఆర్‌ షీట్‌లో బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో మాత్రమే జవాబులు నింపాల్సి ఉంటుంది.సంతకం లేని ఫొటో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్‌ ఆఫీసర్‌తో
సంతకం చేయించుకున్న మూడు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి.
హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి.
మొత్తం 10,56,391 మంది పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారగ. 6,81,664 మంది తొలిరోజునే పరీక్షకు హాజరవుతారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *