లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

వైరస్ ఎక్కడిదంటే.. చైనా అదే బుకాయింపు : మహమ్మారిపై విజయానికి ఏడాది.. వుహాన్‌లో వార్షికోత్సవ సంబరాలు!

Published

on

Wuhan marks its anniversary with triumph : ప్రపంచాన్ని కరోనా చీకట్ల్లోకి నెట్టేసిన డ్రాగన్ చైనా.. మహమ్మారిని విజయవంతంగా కంట్రోల్ చేశామంటూ ఘనంగా యానివర్శరీ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్ సిటీలో లాక్ డౌన్‌కు ఏడాది అయిన సందర్భంగా ఎగ్జిబ్యూషన్ వార్షికోత్సవ సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా కోవిడ్-19 ఆవిర్భావించిన వుహాన్ సిటీలో వైరస్ బారినుంచి కోలుకున్నాక మొదటిసారి ఈ యానివర్శరీ వేడుకలను మహమ్మారిపై విజయానికి ప్రతీకగా జరుపుకుంటోంది. దీన్ని విపత్తుగా చెప్పుకోవడం లేదు.. విక్టరీగా ప్రకటించుకుంది. ఎందుకంటే.. కరోనా వైరస్ ఎక్కడో పుట్టిందని తమ దగ్గర మాత్రం కాదని నిసిగ్గుగా సమర్థించుకుంటోంది. కరోనావైరస్ వుహాన్ సిటీలోని ఓ ల్యాబరేటరీ నుంచి లీక్ అయిందంటూ ప్రపంచమంతా కోడై కూస్తుంటే.. చైనా మాత్రం తమ తప్పేమి లేదంటూ కొట్టిపారేస్తోంది.

మహమ్మారిని ప్రారంభంలోనే ఎలా విజయవంతంగా నియంత్రించడం సాధ్యపడిందో ధీరాలు పలుకుతోంది. డిసెంబర్ 2019లో వుహాన్ సిటీలో కరోనా మొదటి కేసు నమోదు కాకముందే.. వైరస్ చైనా బయటదేశాల నుంచి వచ్చిందని అనేక అధ్యయనాల్లో రుజువైందంటూ ఊదరగొడుతోంది. SARS-CoV-2 అనే వైరస్ ఫుడ్ ప్యాకేజీలు, సరిగా వండని ఆహార పదార్థాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా తమదేశంలో వైరస్ వ్యాపించి ఉంటుందని గుర్తించామని బుకాయిస్తోంది. కరోనా వైరస్ నిర్మూలించడంలో విజయవంతం అయ్యామంటూ 11 మిలియన్ల జనాభా గల వుహాన్ సిటీ దాదాపు ఏకాభిప్రాయంతో పునరావృతమవుతుంది. గత ఏడాది జనవరి 23న, చైనా అధికారులు వుహాన్ నుండి రవాణా కార్యకలాపాలను నిలిపివేశారు.

నగర జనాభాను ఇళ్లకు పరిమితం చేశారు. కఠినమైన లాక్ డౌన్ విధించి గత ఏడాది జనవరి 23 న, చైనా అధికారులు వుహాన్ నుండి రవాణా సంబంధాలను తెంచుకున్నారు నగర జనాభాను వారి ఇళ్లకు పరిమితం చేశారు. వుహాన్‌లో కఠినమైన లాక్ డౌన్ విధించి వైరస్‌ను అదుపులోకి తీసుకొచ్చి ఏడాది అయిన సందర్భంగా పెద్ద ఎగ్జిబిషన్ హాల్‌లో వార్షికోత్సవం జరుపుకుంటోంది. అంతర్జాతీయ సహకారం గురించి చైనా వాగ్దానం చేసినప్పటికీ.. వైరస్ ఎక్కడ నుంచి వచ్చింది అనే అతిపెద్ద ప్రశ్నకు ప్రపంచానికి సమాధానం ఇవ్వడానికి మాత్రం దాటవేస ధోరణితోనే ఉందని చెప్పకనే చెప్పేసింది.