లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

టెక్నో థ్రిల్లర్‌గా ‘WWW’

Published

on

WWW Teaser: పాపులర్ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘118’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను, ఇండస్ట్రీని ఆకట్టుకున్నారు. తన రెండో సినిమాగా మరో సరికొత్త ప్రయోగం చేస్తున్నారాయన.

అదిత్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై, కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ.. ‘WWW – వూ, వేర్, వై.. ఎవరు, ఎక్కడ, ఎందుకు’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

WWW ప్రీ లుక్..

టెక్నాలజీకి సంబంధించి సరికొత్త అంశంతో ‘WWW’ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఎమోషన్స్‌తో కూడిన టెక్నో థ్రిల్లర్‌గా రానున్న ఈ టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాకి డైలాగ్స్ : మిర్చి కిరణ్, సంగీతం : సైమన్ కె కింగ్, ఎడిటింగ్ : తమ్మిరాజు, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్, నిర్మాత : డా. రవి పి రాజు దాట్ల, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం : కె.వి.గుహన్.