X-Men: Dark Phoenix Official Telugu Trailer

ఎక్స్ మెన్ : డార్క్ ఫినిక్స్ ట్రైలర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎక్స్ మెన్ అపోకలిప్స్’‌కి సీక్వెల్‌గా రాబోతున్న డార్క్ ఫినిక్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్..

హాలీవుడ్ X-MEN సిరీస్‌లో వచ్చే సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 11 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రాబోయే మూవీకి ‘డార్క్ ఫినిక్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ‘ఎక్స్ మెన్ అపోకలిప్స్’‌కి సీక్వెల్‌గా రాబోతున్న డార్క్ ఫినిక్స్ తెలుగు ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసారు. ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ టర్నర్ ఫినిక్స్ క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్‌కి టెలీకైనెటిక్ పవర్స్ ఉంటాయి. దీని ద్వారా ఒక మనిషిని టచ్ చెయ్యకుండానే వారిని ఏదైనా చెయ్యొచ్చు. ఈ క్యారెక్టర్ కోసం సోఫీ చాలా కష్టపడిందట. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, షిజోఫ్రెనియా గురించి రీసెర్చ్ చేసిందట.

ఇన్నేళ్ళ ఎక్స్ మెన్ హిస్టరీలో ఓ నటికి ఈ స్థాయి కీ రోల్ దొరకడం ఇదే ఫస్ట్ టైమ్ అని  హాలీవుడ్ వర్గాల వారు చెప్తున్నారు. జేమ్స్ మాక్‌వోయ్, మైఖేల్ ఫాస్‌బెండర్, జెన్నిఫర్ లారెన్స్, నికోలస్ హోల్ట్, అలెగ్జాండర్ షిప్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. జూన్ 5న డార్క్ ఫినిక్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సిమోన్ కిన్‌బర్గ్ డైరెక్ట్ చెయ్యగా, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్, బ్యాడ్ హ్యాట్ హ్యారీ ప్రొడక్షన్స్, ది డానర్స్ కంపెనీ, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మించాయి. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని విడుదల చేస్తుంది.

వాచ్ ట్రైలర్..

Related Posts