రెడీ మీ ఫోన్లు పండుగ ఆఫర్లతో గతంలో లేని భారీ తగ్గింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ దేశం దసరా పండుగను ఫుల్ జోష్‌గా జరుపుకునేందుకు రెడీ అయిపోయింది. మరి దాని కోసం నెం.1 స్మార్ట్ ఫోణ్ రెడ్ మీ కూడా రెడీ అంటుంది. దసరా.. దీపావళి కానుకగా రెడ్ మీ ప్రొడక్ట్‌లపై ఆకట్టుకునేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 16న ప్రారంభమైన ఈ సేల్‌ అక్టోబరు 21 వరకు కొనసాగనుంది.

దేశంలోనే బిగ్ ఫెస్టివల్ సందర్భంగా రెడ్‌మి నోట్‌-9, రెడ్‌మి 9 సిరీస్‌, ‘దేశ్‌ కా స్మార్ట్‌ఫోన్‌’ రెడ్‌మి-9ఏ ఫోన్లను ఆడియో ఉత్పత్తులు, ఇతర యాక్సెసరీస్‌తో కలిపి మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకే అందిస్తోంది. వాటితో పాటు భారీ డిస్కౌంట్లూ అందుబాటులో ఉన్నాయి. అదనంగా Axis bank‌, Bank of Baroda క్రెడిట్‌ కార్డ్స్‌తో రూ.1000 వరకు తక్షణ రాయితీ పొందవచ్చు.రూ.18వేల 999 ధరతో మార్కెట్లోకి వచ్చిన ‘రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌‌’ కేవలం రూ.15వేల 999లకే అందిస్తోంది. ప్రో కెమెరాలతో గరిష్ఠ పెర్‌ఫార్మెన్స్‌ను ఇవ్వగలదు ఈ ఫోన్. పెర్‌ఫార్మెన్స్‌ పవర్‌ హౌస్‌గా పేరు దక్కించుకున్న రెడ్‌మి నోట్‌ 9 ప్రో కేవలం రూ.12వేల 999లకే అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లోకి రూ.16వేల 999లతో విడుదలైంది. ఈ రెండు మోడళ్లపై 6 నుంచి 12 నెలల వ్యాలిడిటీతో కూడిన నో కాస్ట్‌ EMI కూడా అందుబాటులో ఉంది.

తిరుగులేని ఛాంపియన్‌ రెడ్‌మి నోట్‌ 9 అత్యంత కనిష్ఠ ధరకు అంటే రూ.14వేల 999కే విడుదల చేయగా.. ఈ ఫోన్‌ దీపావళి కానుకగా.. కేవలం రూ.10వేల999కే దొరుకుతుంది. తక్కువ కాస్ట్‌లో మంచి స్క్రీన్, గ్రేట్ ఫీల్‌ని కలిగించే కెమెరాలతో వస్తోన్న రెడ్‌మి 9 సిరీస్‌ ఫోన్లపై తొలిసారి లిమిటెడ్ టైం డిస్కౌంట్లను అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రూ.13వేల 999 ధర పలికే రెడ్‌మి 9 ప్రైమ్‌(4జీబీ+128జీబీ)ను రూ.10వేల 999కే మీ సొంతం చేసుకోవచ్చు.

ఇక రెడ్‌మి -9ఐ ఫోన్లు రూ.8వేల 999 నుంచే అందుబాటులో ఉన్నాయి. దేశంలో లక్షలాది మందికి అందుబాటులో ధరలో ఉన్న రెడ్‌మి 9ఏ ఇప్పుడు మరింత చౌకగా రూ.8వేల 499 నుంచి భారీగా తగ్గి.. రూ.6వేల 499లకే అందిస్తోంది.

Related Posts