Xiaomi Mi TV 5, Mi TV 5 Pro series launched: Key features, price and everything else

ఫీచర్లు.. ధర ఎంతంటే? : షియోమీ నుంచి కొత్త Smart TV సిరీస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ రెండు కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ లాంచ్ చేసింది. చైనాలోని బీజింగ్ జరిగిన కార్యక్రమంలో షియోమీ Mi TV5 సిరీస్, Mi TV 5 ప్రొ సిరీస్ రిలీజ్ చేసింది. ఒక్కో సిరీస్ నుంచి మొత్తం మూడు స్మార్ట్ టీవీలను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సిరీస్ స్మార్ట్ టీవీలు PatchWallపై రన్ అవుతాయి. Mi TV 5 సిరీస్ స్మార్ట్ టీవీల్లో కంపెనీ Mi TV5 (75 అంగుళాల డిస్ ప్లే), Mi TV 5 (65అంగుళాలు), Mi TV5 (55అంగుళాలు) ఉన్నాయి. 

అలాగే Mi TV 5 ప్రో సిరీస్ నుంచి Mi TV 5 ప్రో (75 అంగుళాలు), Mi TV 5 ప్రో (65 అంగుళాలు), Mi TV 5 ప్రో (55 అంగుళాలు)తో లభ్యం కానున్నాయి. Pro టీవీ సిరీస్ పరీశీలిస్తే.. Mi TV 5 ప్రో.. మూడు వెర్షన్లతో వస్తోంది. ఒకటి 55 అంగుళాల స్ర్కీన్ ఉంటుంది. రెండోది 65 అంగుళాల స్ర్కీన్ ఉంది. మూడో స్మార్ట్ టీవీ 75 అంగుళాల స్ర్కీన్ తో వచ్చింది. Mi TV 5 ప్రో (75 అంగుళాల స్ర్కీన్) అతిపెద్ద స్మార్ట్ టీవీగా చెప్పవచ్చు. అంతేకాదు.. ధర కూడా ఖరీదైనదే. ఇలాంటి ఖరీదైన స్మార్ట్ టీవీని షియోమీ ఎన్నడూ రిలీజ్ చేయలేదు. 

ఇటీవలే షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి కూడా మొట్టమొదటి స్మార్ట్ టీవీ (70 అంగుళాల స్ర్కీన్) లాంచ్ చేసింది. ఈ Redmi TV70 అంగుళాల స్ర్కీన్ తో త్వరలో ఇండియా మార్కెట్లో రాబోతుందని కంపెనీ ధ్రువీకరించింది. కానీ, మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో రిలీజ్ అయిన ఈ రెండు స్మార్ట్ టీవీలు ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేదానిపై క్లారిటీ లేదు. 

Mi TV 5 Pro (3 వెర్షన్లు) ఫీచర్లు ఇవే :
* క్వాంటమ్ డాట్ డిస్ ప్లే
* HDR 10+, 8K వీడియో సపోర్ట్
* స్లిమ్ సైడ్స్, మినిమల్ బెజిల్స్
* 4GB DDR4, 64GB eMMC
* PatchWall రన్ 
* Dolby Atmos, DTS సపోర్ట్

Mi TV 5 (3 వెర్షన్లు) ఫీచర్లు ఇవే :
* 55-అంగుళాలు, 65-అంగుళాలు 75-అంగుళాల స్ర్కీన్లు
* 3GB ర్యామ్ + 32GB ఇంటర్నల్ స్టోరేజీ
* PatchWall OS
* Dolby Atmos, DTS సపోర్ట్

రెండు వెర్షన్ల ధర ఎంతంటే? :
* Mi TV 5 (55 అంగుళాలు) ధర 2999 యాన్స్
* Mi TV 5 (65 అంగుళాలు) ధర 3999 యాన్స్
* Mi TV 5 (75అంగుళాలు) ధర 7999 యాన్స్
* Mi TV 5 Pro (55 అంగుళాలు) ధర 3699 యాన్స్
* Mi TV 5 Pro (65 అంగుళాలు) ధర 4999 యాన్స్
* Mi TV 5 Pro (75 అంగుళాలు) ధర 9999 యాన్స్

Related Posts