లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

శక్తివంతమైన బ్యాటరీతో.. రూ .8వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు

Published

on

Xiaomi Redmi 9A vs Xiaomi Redmi 9C Launched Today

రెడ్‌మి 9 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల గురించి చాలా వార్తలు వచ్చాయి. అదే సమయంలో, సుదీర్ఘ నిరీక్షణ తరువాత, కంపెనీ ఈ సిరీస్‌లో రెడ్‌మి 9ఎ మరియు రెడ్‌మి 9సి అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మలేషియాలో లాంచ్ అయ్యాయి. అయితే త్వరలో కంపెనీ వాటిని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకుని రానుంది. తక్కువ బడ్జెట్ పరిధిలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు మీడియాటెక్ హెలియో చిప్‌సెట్‌తో రానున్నాయి.

రెడ్‌మి 9ఎ మరియు రెడ్‌మి 9 సి ధరలు:

రెడ్‌మి 9ఎ ధర రూ .6,300 కాగా.. ఇందులో 2 జిబి + 32 జిబి స్టోరేజ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 7 నుంచి మలేషియాకు చెందిన ఈ-రిటైలర్ సైట్ లాజాడాలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. యూజర్లు దీనిని మిడ్నైట్ గ్రే, పీకాక్ గ్రీన్ మరియు ట్విలైట్ బ్లూ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

అదే సమయంలో, రెడ్‌మి 9సి కూడా అదే స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేయబడింది. దీనిలో 2 జీబీ ర్యామ్‌తో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీని ధర రూ .7,500. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై చివరలో అమ్మకానికి వస్తుంది, ప్రస్తుతానికి కంపెనీ అమ్మకపు తేదీని వెల్లడించలేదు. ఇది మిడ్నైట్ గ్రే, సన్ రైజ్ ఆరెంజ్ మరియు ట్విలైట్ బ్లూ రంగులలో లభిస్తుంది.

Read:భారత్‌లో పబ్జీ, జూమ్, వాట్సాప్ ‌బ్యాన్ చెయ్యకపోవడానికి కారణం ఇదే

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *