Xiaomi Redmi Note 8 to go on sale via Amazon at 12pm today

Airtel స్పెషల్ ఆఫర్ : అమెజాన్‌లో Redmi Note 8 సేల్.. ధర ఎంతంటే?  

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి రిలీజ్ అయిన Redmi Note 8 స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్‌సైట్లో మంగళవారం (నవంబర్ 5, 2019) మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటుంది.

ఆసక్తి గల వినియోగదారులు రెడ్ మి నోట్ 8 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. షియోమీ అందించే రెడ్ మి నోట్ 8 సిరీస్ లో రెండు వేరియంట్లలో లభ్యం అవుతోంది. అందులో 4GB RAM +128GB స్టోరేజీ, 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తోంది. 

అమెజాన్ ఫ్లాష్ సేల్లో 4GB ర్యామ్ మోడల్ ధర రూ.9వేల999గా నిర్ణయిస్తే. 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.12వేల 999గా నిర్ణయించారు. ఈ ఫోన్ మొత్తం స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, మూన్ లైట్ వైట్ కలర్లలో లభ్యం అవుతోంది.

మరోవైపు అమెజాన్ నుంచి Redmi Note 8 కొనుగోలు చేసిన ఎయిర్ టెల్ యూజర్లకు ప్రత్యేకించి ఆఫర్లు అందిస్తోంది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రోగ్రామ్ కింద ఎయిర్ యూజర్లకు అన్ లిమిటెడ్ కాలింగ్ సహా ఇతర బెనిఫెట్స్ ఆఫర్ చేస్తోంది. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* కొత్త Aura Fluid డిజైన్ (2.4D రిఫ్లెక్టివ్ గ్లాస్ బ్యాక్)
* 6.3 అంగుళాల FHD+ డిస్‌ప్లే (90శాతం స్ర్కీన్ బాడీ రేషియో)
* కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 (ఫ్రంట్ అండ్ బ్యాక్)
* క్వాడ్ లెన్స్ కెమెరా సెటప్
* 48MP ప్రైమరీ లెన్స్
* 8MP అల్ట్రా వైడ్ లెన్స్
* 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో లెన్స్ (సెల్ఫీలు)
* 13MP కెమెరా (ఫ్రంట్)
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 అక్టా కోర్ ప్రాసెసర్
* 2.0GHzతో 3వ జనరేషన్ AI ఇంజిన్
* 4,000mAh బ్యాటరీ 
* 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (2 గంటల ఛార్జింగ్)
* P2i ప్రొటెక్ట్ (లైట్ రెయిన్స్, యాక్సిటెండ్ డ్యామేజ్ నుంచి రక్షణ)

Related Posts