లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

షియామీ రిపబ్లిక్‌డే సేల్ : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..

Published

on

Xiaomi Republic Day Sale : ప్రముఖ మొబైల్‌ తయారీదారు షియామీ యూజర్ల కోసం రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. పోటీదారులైన ప్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఆఫర్లకు ధీటుగా షియామీ భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. జనవరి 20 నుంచి జనవరి 24 వరకు రిపబ్లిక్ డే సేల్‌ నిర్వహిస్తోంది. షావోమి వెబ్‌సైట్ mi.comలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. యాక్సిస్‌ బ్యాంకు కార్డు వినియోగదారులకు అదనంగా బెనిఫెట్స్ పొందొచ్చు. షియామీ 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఎంఐ వీఐపీ మెంబర్స్ సేల్ ముందురోజు నుంచే ఈ సేల్ ఆఫర్లను యాక్సస్ చేసుకోవచ్చు.

షియామీ సబ్ బ్రాండ్ రెడ్ మి మోడళ్లలో రెడ్ మి నోట్ 9 సిరీస్, రెడ్ మి 9 ప్రైమ్, రెడ్ మి 9ఐ స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ వాచ్ రివాల్వ్‌పై కూడా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. రెడ్‌మి ఇయర్‌బడ్స్, ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్, ఎంఐ టివి స్టిక్ ఆఫర్లు, డిస్కౌంట్‌లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లలో Redmi 9i (4GB+64GB) స్టోరేజీ మోడల్ MRP ధర రూ.8,299 ఉండగా.. ఆఫర్ ధర రూ.7,999 లభ్యం కానుంది. Redmi 9ప్రైమ్ (4GB+64GB) స్టోరేజీ మోడల్ రూ.9,499, రూ.500 డిస్కౌంట్ ధర అందించనుంది.

Redmi Note 9 (6GB+128GB) స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999లకే అందిస్తోంది. రిపబ్లిక్ డే సేల్ కింద రూ.1000ల తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది. ఎంఐ LED స్మార్ట్ టీవీలపై రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్‌ అందిస్తోంది. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (RO+UV) వంటి ఇతర ఉత్పత్తులపై రూ. 3వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. Redmi Note 9pro (4GB+128GB) స్టోరేజీ రూ. 2,000. తగ్గింపు ధరతో రూ.13,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ బండెల్ ఆఫర్ Mi.com, Mi Home స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. mi.com సేల్ పేజీలో ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *