యాదాద్రిలో సీఎం కేసీఆర్..ప్రత్యేక పూజలు..ఆలయ పునర్ నిర్మాణ పనుల పరిశీలన

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Yadadri Temple : తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా.. తుది దశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రధానాలయం పక్కనే నిర్మిస్తున్న శివాలయం, పుష్కరిణి నిర్మాణాలు కూడా పూర్తి కావొచ్చాయి. ప్రెసిడెన్సిషియల్‌ సూట్స్‌, రింగ్‌రోడ్డు, పెద్దగుట్టపై అభివృద్ధి పనులను కేసీఆర్‌ పరిశీలిస్తారు. ఆ తరువాత పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు.

2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. తరువాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కేసీఆర్‌కు హారతి ఇచ్చారు. ఆ తరువాత ఆలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.



ఆలయ చివరి దశ పనులతో పాటు.. అనుబంధ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తున్న ప్రసాదం కాంప్లెక్స్‌ భవనం పూర్తయ్యింది. కింది రెండు ఫ్లోర్లలో ప్రసాదాల తయారీ కోసం ఆధునిక పద్దతులతో వంటశాలను నిర్మించారు. నాలుగో అంతస్తులో ప్రసాద విక్రయాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ప్రాకార మంటపాల అంతర బాహ్య సాలహారాల్లో ఏర్పాటు చేయనున్న విగ్రహాల నమూనాలను ఇటీవల శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి పరిశీలించి ఫైనల్‌ చేశారు. సాలహారాల్లో నరసింహుడి బ్రహ్మోత్సవ రూపాలు, దశావతారాలు, అష్టలక్ష్మి, శ్రీకృష్ణుడి పలు అవతారాల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.



యాదాద్రి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా.. అహ్లాదకరంగా మారింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు యాదాద్రి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని అధికారులు పెంపొందించారు. స్వామి వారి కొండను 108 రకాల మొక్కలతో హరితమయం చేశారు. సుమారు 22 కోట్లతో మొక్కల పెంపకం, గార్డెనింగ్‌ పనులు చేపట్టారు. అలాగే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ కోసం రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి వాహనాలలో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా.. యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. తుర్కపల్లి, రాజాపేట, రాయగిరి, వంగపల్లి నుంచి యాదగిరిగుట్టకు వచ్చే మార్గాలను అనుసంధానిస్తూ దీన్ని నిర్మిస్తున్నారు. ఆయా మార్గాల నుంచి వాహనాలు గుట్టకు రాకుండానే ఇతర మార్గాల వైపు మళ్లించేలా నిర్మిస్తున్నారు.



ప్రధాన ఆలయ పునర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో టెంపుల్ సిటీలో కాటేజీ నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కాటేజీల నిర్మాణానికి సహకరించేందుకు దాతలు, పలు సంస్థలు ముందుకు రావడంతో వారితో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానాలయం పనులు పూర్తి కావడంతో సీఎం కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

READ  రాజధాని మార్పుపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Related Posts