Home » అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్!
Published
1 month agoon
By
vamsiఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులకు కూడా కరోనా సోకుతూ ఉండడం కలకలం రేపుతుండగా.. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారికి మరోమారు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. లేటెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా మరోసారి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అంబటి రాంబాబు స్వయంగా వెల్లడించారు. అంతకుముందు కూడా అంబటి రాంబాబుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా వైరస్ బారిన పడ్డట్టు తెలిసిందని ఆయన వెల్లడించారు. “జులైలో కరోనా వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే. నిన్న అసెంబ్లీ సమావేశాల సంధర్భంగా కోవిడ్-19 టెస్ట్ చేయించుకున్నాను. రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి. రీ ఇన్ఫెక్షన్కి గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిడ్‌ని మరోసారి జయించి మీ ముందుకి వస్తాను” అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులను కలిశారు. అయితే అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్ అని తేలియడంతో.. ఆయనను కలిసిన కొందరిలో ఆందోళన నెలకొంది. వారు టెస్టులు చేయించుకునే అవకాశం కనిపిస్తోంది.