ప్రతిపక్ష నాయుకుడిలా కాకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు..బాబును చీల్చిచెండాడిన శ్రీకాంత్ రెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని…ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదనే దుర్మార్గపు ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదన్నారు. అమరావతి రైతులు గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. శ్రీశైలం రైతులు 80 వేల ఎకరాలు పొగొట్టుకుంటుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అమరావతి పచ్చగా ఉందంటే కారణం శ్రీశైలంలో భూములిచ్చిన నిరు పేదలని..మరి ఈ ప్రాంతాల సెంటిమెంట్ గుర్తుకురాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రతిపక్ష నాయుకుడిలా కాకుండా ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నావని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రజా నాయకుడు అన్ని ప్రాంతాల గురించి ఆలోచన చేయాలన్నారు. ప్రజలందరి సెంటిమెంట్స్ ను గుర్తించాలన్నారు. వ్యవస్థలను వాడుకుని ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రజలందరూ హైదరాబాద్ కు వచ్చి చంద్రబాబు ఇంటిని చుట్టుముడుతారని, ఆయనకు తగిన బుద్ధి చెబుతురాని హెచ్చరించారు.

పక్క రాష్ట్రంలో దావుకుని అమరావతి..అమరావతి అంటున్నావు…ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేకపోయావని విమర్శించారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని మాట్లాడుతున్నావని మండిపడ్డారు. జగన్ అమరావతిలో పర్మినెంట్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని నిర్మించుకున్నారని..నీకు ఆ చిత్తశుద్ధి కనపడ లేదా అని నిలదీశారు.

వైజాగ్ లో తమ పార్టీ నాలుగు స్థానాల్లో ఓడిపోయింది.. అయినా అలాంటి రాజకీయ ఆలోచన చేయడం లేదన్నారు. అమరావతిలో గెలిచాం..కానీ అమరావతి ఏరియాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. నీవు చూపించిదంతా గ్రాఫిక్స్..నీవు ఏం చేయలేవని ప్రజలు అక్కడ చూశారు కాబట్టి ప్రజలు అక్కడ నిన్ను ఓడించారు. రాజకీయ నాయకులు సంస్కారంతో, ఉందాగా వ్యవహించాలన్నారు. రాయలసమీకు రావాల్సిన అవకాశాలను పొగొడితే ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజు వస్తుందన్నారు.

రాయలసీమ వాసులపై ఏమాత్రం ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, హైకోర్టు గురించి తమతో కలిసి రావాలన్నారు. ఇద్దరం కేంద్రాన్ని డిమాండ్ చేద్దామని పబ్లిసిటీ, సినిమాటిక్ ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. మంచి చేయాలనే ఆలోచన హైదరాబాద్ ను తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఐదు సంవత్సరాలు సీఎంగా ఉండి విజయవాడలో ఏమీ చేయలేకపోయారని నిలదీశారు. చంద్రబాబు పరిపాలించిన 14 సంవత్సరాలు రాయలసీమ గొంతు కోశాడని వ్యాఖ్యానించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో హెచ్ సీఎల్, బీహెచ్ సీఎల్ పరిశ్రమలు అక్కడ పెట్టడం వల్ల లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయని తెలిపారు. అదే రంగంగా ఐటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని చేరడంతో పెద్ద మహానగరం అయిపోయి మిగిలిన ప్రాంతాలకు ఎక్కడ కూడా అభివృద్ధి కాకుండా పోయాయని తెలిపారు. ఒరిస్సా, తమిళనాడులలో మూడు, నాలుగు సిటీలను డెవలప్ చేశారు.

READ  జగన్‌ను గెలిపించండి: హోదాకు మజ్లీస్ మద్దతు 

బీహార్ లాంటి స్టేట్ లో కూడా ఒకవేళ పాట్నా కేపిటల్ ఉంటే మిగిలిన చోట పరిశ్రమలను డెవలప్ చేశారని తెలిపారు. అదే విధంగా తమిళనాడులో చెన్నై కేపిటల్ ఉన్నప్పుడు కోయంబత్తూరు సిటీలో ఇండస్ట్రీయల్ డెవలప్ చేశారు. అన్ని స్టేట్స్ అలాగే జరిగాయని తెలిపారు.

Related Posts