‘అయ్ బాబోయ్ ఎంత పొడుగు కాళ్లో’ 17 ఏళ్ల అమ్మాయి గిన్నిస్ రికార్డ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Texan girl : ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాళ్లు కలిగిన ఓ సుందరి ఏకంగా గిన్నీస్ రికార్డుని సొంతం చేసుకుంది. 17 ఏళ్ల యువతి ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాళ్లు ఉన్న యువతిగా 2021 Year గిన్నిస్ బుక్‌లో రికార్డు క్రియేట్ చేసింది.

అమెరికాలోని టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల పొగుడు కాళ్ల సుందరి పేరు మెసీ కరిన్. తన కాళ్ల ఫొటోలు పెడితే సోషల్ మీడియా జనం పిచ్చెక్కిపోయారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాళ్లు ఉన్న మహిళగా ఆమె గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది.

మెసీ కరిన్ కాళ్ల పొడవు ఎంతో తెలుసా 1.5 మీటర్లు. ఎడమకాలు 135.267 సెంటీమీటర్లు. కుడికాలు 134.3 సెంటమీటర్లు పొడవు ఉన్నాయి. పొడుగ్గా ఉండడం ఆనందమే అయినా కొన్ని కొన్ని సార్లు దాని వల్ల సమస్యలు కూడా వస్తున్నాయని చెబుతోందీ సుందరి. ముఖ్యంగా కార్లో కూర్చున్నప్పుడు మరీ కాళ్లు ముడుచుకుని కూర్చోవాల్సి వస్తుంది.

 

ఈ పొడుగు కాళ్ల వల్ల ఆమెకు ఇబ్బందులే కాదు ఉపయోగాలు కూడా ఉన్నాయంటోంది. హై స్కూల్ వాలీబాల్ ఆడేటప్పుడు ఆ కాళ్లే తనకు ప్లస్ అవుతాయంటోంది.

మాసి కరిన్ ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. పొడుగు కేటగిరీలో మరిన్ని రికార్డులు కొట్టాలని ట్రై చేస్తోంది. త్వరలో బ్రిటన్ వెళ్లి అక్కడ మోడలింగ్ చేయడం చేసి..ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రొఫెషనల్ మోడల్‌గా రికార్డు సృష్టించాలని టార్గెట్ గా పెట్టుకుందట.

మాసి కరిన్ తన పొడవాటి కాళ్లతో సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. తన పొడుగు కాళ్లే తనకు ఆ స్టార్ ఇమేజ్ సంపాదించి పెట్టాయని తెగ మురిసిపోతోంది.

తన పొడుగు కాళ్లతో మరిన్ని రికార్డులు కొట్టాలని ట్రై చేస్తోంది. త్వరలో బ్రిటన్ వెళ్లి అక్కడ మోడలింగ్ చేయడం ద్వారా , ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రొఫెషనల్ మోడల్‌గా రికార్డు సృష్టించాలనుకుంటోంది.

‘‘కాళ్లు పొడవుగా ఉండటం కొన్ని సందర్భాల్లో ఇబ్బందే. కానీ వాటిగురించి నేనెప్పుడూ బాధపడలేదు. ఇంత పొడుగు కాళ్లు ఉండటం గర్వంగా భావిస్తాను. నా కాళ్లకు సరిపడా దుస్తులు దొరకడం కూడా కష్టమే. అందుకే..నా డ్రెస్సులు ప్రత్యేకంగా కుట్టించుకుంటున్నాను’ అని తెలిపింది మెసీ.

మెసీ కురిన్ 9 ఏళ్ల వయస్సులోనే 5.7 అడుగుల పొడవు ఉండేది. ఫ్యామిలీలోనూ ఆమె తండ్రి 6 అడుగుల 5 అంగుళాలు. వాళ్ల తమ్ముడు 6 అడుగుల 3 అంగుళాలు. ఇక మెసీ లెఫ్ట్ లెగ్ 136.267 సెంటిమీటర్ల (53.255ఇంచులు), ఆమె రైట్ లెగ్ 134.3సెంటిమీటర్లు (52.874 ఇంచులు) ఉన్నాయి.

ఈ 17 ఏళ్ల పొడగరి ఎత్తు.. 6 అడుగుల పది అంగుళాలు కాగా..కేవలం ఆమె కాళ్లే 4 అడుగుల 5 ఇంచులు పొడవు. అంటే ఆమె శరీరంలో సగం కంటే ఎక్కువ కాళ్లే ఉంటాయి. దీంతోఅతి పొడవైన కాళ్లు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.

కాగా..2017లో రష్యాకు చెందిన ఎకాటెరినా లెసినా అతి పొడవైన కాళ్లు కలిగిన వ్యక్తిగా సాధించిన రికార్డును ప్రస్తుతం మెసీ బ్రేక్ చేసింది. ఎకాటెరినా ఎత్తు 6 అడుగుల 8.77 అంగుళాలు కాగా..ఆమె కాళ్ల పొడవు 132 సెంటిమీటర్లు.

Related Tags :

Related Posts :