Yesvantpur Tatanagar Superfast Express Passengers Problems

రైలు ప్రమాదం : తాగునీటి కోసం ప్రయాణికుల ఇబ్బందులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజమండ్రి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు

రాజమండ్రి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యాంట్రీ కార్(వంట చేసే) బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. మంటల్లో ప్యాంట్రీ కార్ పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Also Read : తప్పిన ఘోర ప్రమాదం : ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

అగ్ని ప్రమాదంతో రైలుని గొల్లప్రోలు స్టేషన్‌లో నిలిపివేశారు. 5 గంటలుగా రైలని అక్కడే నిలిపేశారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటిపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. కనీసం తాగడానికి మంచీ నీళ్లు కూడా లేవని వాపోతున్నారు. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గురించి పట్టించుకోవడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు.

తక్షణమే రైల్వే శాఖ అధికారులు స్పందించాలని రైలుని పునరుద్దరించాలని లేదంటే తమకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన స్థానికులు, సేవా సంస్థలు ప్రయాణికులకు తాగునీరు, అల్పాహారం వంటివి అందజేస్తున్నారు. స్థానికుల చొరవతో కొంతమంది చంటిపిల్లలకు పాలు లాంటి సదుపాయం కలిగింది.

తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో రైల్లోని ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలు ఉండగా 9వ బోగీ అయిన పాంట్రీకార్ మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలు ఆపేశారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అంతా రిలాక్స్ అయ్యారు. మంటల్లో బోగీ పూర్తిగా కాలిపోయింది. బోగీలో మంటలు చూసి అసలేం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన బోగీని.. ఇతర బోగీలతో వేరు చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
Also Read : గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్

Related Posts