Home » ‘లవ్ జీహాద్’ బిల్ అప్రూవ్ చేసిన యోగి ప్రభుత్వం
Published
2 months agoon
By
subhnLove Jihad: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా బిల్ పాస్ చేసింది. ఇలా చేయడం నేరమని, అందుకు పాల్పడితే ఐదేళ్ల శిక్ష తప్పదని అందులో పేర్కొంది. ‘మతాంతర వివాహాల్లో అభ్యంతరాలపై ఆర్డినెన్స్ జారీ చేయాలని యూపీ క్యాబినెట్ నిర్ణయించింది’ అని క్యాబినెట్ మినిష్టర్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు.
ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే కాకుండా.. రూ.15వేలు జరిమానా కూడా తప్పదు. మైనార్లను, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు చెందిన వారిని మారాలని బలవంతపెడితే రూ.25వేల జరిమానా, జైలు శిక్ష తప్పదని సింగ్ చెప్పారు.
అంతకంటే ముందు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ ప్రభుత్వం కూతుళ్లకు, సోదరీమణులకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారి పట్ల హిందువుల ధార్మిక నినాదం ‘రామ్ నామ్ సత్య హై’ను అనుసరిస్తుందని చెప్పారు. ‘మేం చాలా ప్రభావవంతమైన చట్టాన్ని తీసుకురానున్నాం. పేర్లు చెప్పకుండా గౌరవం, వ్యక్తిత్వాలతో ఆడుకునేవారిని హెచ్చరిస్తున్నాం. వారి పద్ధతి మార్చుకోకపోతే రామ్ నామ్ సత్య అనే పద్ధతి మొదలవుతుంది అని బహిరంగ సభలో మాట్లాడారు.
అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లు కూడా ఇదే తరహాలో కొనసాగనున్నాయి.