లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అయ్యో..! : గర్ల్‌ఫ్రెండ్‌ని సర్ ప్రైజ్ చేద్దామని ఫ్లైట్ లో వెళ్లి..పోలీస్ స్టేషన్ లో పడ్డాడు

Published

on

Yong man flies 2000 kms from bengaluru to lucnow : ప్రేమ..అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడిన యువతీ యువకులు అందాల ప్రపంచంలో విహరిస్తుంటారు. ఒకరి కోసం మరొకరు ఏదైనా సరే చేసేద్దామనుకుంటారు. అలా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలుద్దామని ఏకంగా 2వేల కిలోమీటర్లు ఫ్లైట్ లో ప్రయాణించి మరీ వెళ్లాడు. కానీ పాపం తీరా వెళ్లాక చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో పడ్డాడు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్ష్మిపూర్ ఖేరిలో ఆదివారం (జనవరి 10,2021) రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆ ప్రేయసి తప్పు మాత్రం లేదండోయ్..అపార్థం చేసుకునేరు…పాపం కదా..ప్రేమకోసం వెళితే పోలీస్ స్టేషన్ లో పడటం..

అసలు విషయం ఏంటంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ద్యోరియా జిల్లాకి చెందిన 21 ఏళ్ల యువకుడు సల్మాన్ బెంగళూరులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఓ ఆన్‌లైన్ యాప్ ద్వారా సల్మాన్ కు లక్ష్మిపూర్ ఖేరి ప్రాంతానికి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా స్నేహంగా మారింది. తరచూ ఇద్దరూ మాట్లాడుకునేవారు. గత ఆదివారం ఆమె బర్త్‌డే. దీంతో ప్రేయసికి కావడంతో సరిగ్గా బర్త్‌డే సెలబ్రేషన్స్ కు వెళ్లి ఆమెకు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని సల్మాన్ ఎంతోగానో తపన పడ్డాడు.

అలా అనుకున్నదే తడవు ఆమె కోసం టెడ్డీ బేర్, చాక్లెట్స్ వంటి పలు గిఫ్టులు కొనుక్కుని వాటిని అందంగా ప్యాక్ చేయించి వాటిని తీసుకుని బెంగళూరు నుంచి విమానంలో లక్నో చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ బస్సులో లక్ష్మిపూర్ ఖేరికి దాదాపు 2వేల కిలోమీటర్లు పైగా దూరం ప్రయాణించి గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్లాడు సల్మాన్.

తీరా గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాక అను ఊహించని ఘటన జరిగింది. తన గర్ల్ ఫ్రెండ్ తల్లిదండ్రులు నువ్వెవరో మాకు తెలీదని అన్నారు. దీంతో అతన్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఆ విషయం తమ కూతురికి కూడా చెప్పలేదు. ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చానని అతను చెప్పటంతో గర్ట్ ఫ్రెండ్ తల్లిదండ్రులు సల్మాన్ పై పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి సల్మాన్ ను తీసుకెళ్లిపోయారు.

అలా ఆరోజు రాత్రంతా స్టేషన్‌లోనే గడపాల్సి వచ్చింది పాపం సల్మాన్. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిపై కేసు పెట్టేందుకు ఆసక్తి చూపించలేదనీ అందుకే సల్మాన్ ను హెచ్చరించి వదిలేయాలనుకున్నామని కొత్వాల్ పోలీస్టేషన్ ఇంచార్జి సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. దీంతో అతడిని నిన్న సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి.. వ్యక్తిగత పూచీకత్తతో విడుదల చేశారు. దీంతో పాపం గర్ల్ ఫ్రెండును కలవలేక..ఆమె సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటే తిరిగి అతనికే ఝలక్ తగిలింది. అదండీ పాపం సల్మాన్ సర్ ప్రైజ్ కథ..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *