కొలీగ్స్ ప్రెగ్నెంట్ అయితే, మీరూ గర్భందాల్చే అవకాశాలెక్కువ.. కొత్త స్టడీ చెబుతోంది…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆడవాళ్ళు గర్భం దాల్చే విషయంలో ఆశ్చర్యం కలిగించే అంశం తెలిసింది. మీరు పనిచేసే ఆఫీసులో గానీ..మీ ఇంటిలో గానీ లేక మీరు పనిచేసే ప్రదేశంలో గానీ ఎవరైనా మహిళ గర్భం దాలిస్తే..అక్కడ పనిచేసే మరికొంతమంది మహిళలు కూడా గర్భం దాల్చే అవకాశాలు చాలా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. ఇది చెప్పుకోవటానికి ఆశ్చర్యం కలిగించేదే అయినా పలు సందర్భాల్లో నిజమని తేలింది.
ఉదాహరణకు : అరిజోనాలోని మీసాలో గల బ్యానర్ డిజర్ట్ మెడికల్ సెంటర్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో పని చేస్తున్న 16మంది నర్సులు ఒకేసారి గర్భం దాల్చిన విషయం తెలిసిందే.అటువంటిదే ఈ పరిశోధనలోని సారాంశం.

కొలోన్ యూనివర్శిటీ చేసిన కొత్త పరిశోధనల ప్రకారం..ఒకేచోట పనిచేసే మహిళల్లో ఒకరు గర్భం దాలిస్తే వెంటనే అక్కడ పనిచేసే మరికొంతమంది గర్భం దాలుస్తారని కొలోన్ యూనివర్శిటీ పరిశోధనల్లో తేలింది. ఒకే పనిచేసేవారే కాదు ఒకేచోట నివాసముండేవారు,.ఒకే ఇంటిలో ఉండేవారు ఇలా ఒకేచోట ఉండేవారిలో ఇటువంటివి జరుగుతుంటాయని తేలింది.

డచ్ సిస్టమ్స్ ఆఫ్ సోషల్ స్టాటిస్టికల్ డేటాసెట్స్ (ఎస్ఎస్డి) నుండి డేటాను పరిశోధకులు విశ్లేషించాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఇందులో డచ్ జనాభా యొక్క వారి కుటుంబ సభ్యులు…ఆయా ఆఫీసుల్లో పనిచేసే మహిళలపై జరిగిన పరిశోధనల ప్రకారం ఈ విషయం వెల్లడైంది.

ఒక మహిళ గర్భం దాల్చి దాన్ని ఎంజాయ్ చేస్తూ..పుట్టే బేబీ గురించి పలు విషయాలు మాట్లాడుతుంటూ తోటివారికి కూడా ఆ అనుభూతి కలుగుతుంది. వారు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆహా నాకు కూడా ఓబేబీ పుడితే బాగుండు అని వచ్చే ఆలోచనతో వారు కూడా గర్భ దాల్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అటువంటి అనుభూతులకు వారి మనస్సు ప్రేరేపిస్తుంది. దాంతో వారు గర్భం దాల్చే అవకాశాలున్నాయని తేలింది.

Related Posts