you eat meat you may become cannibal bjp leader on egg row in mp

గుడ్లు పెట్టి.. పిల్లలను నరమాంస భక్షకులుగా తయారు చేస్తారా : బీజేపీ ఎంపీ విమర్శలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అంగన్ వాడీ చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ గోపాల్ భార్గవ్ తీవ్రంగా విమర్శించారు. అంగన్ వాడీల్లో చిన్నారులకు గుడ్లు పెట్టి వారిని చిన్ననాటి నుంచే నరమాంస భక్షకులుగా తయారు చేస్తారా? అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. 

భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు మాంసాహారం విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఎంపీ గోపాల్. ఇందుకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ సంచలన కామెంట్స్ చేశారాయన. చిన్ననాటి నుంచే పిల్లలకు గుడ్లు అలవాటు చేస్తోందని విమర్శించారు. చిన్ననాటి నుంచే బలవంతంగా గుడ్లు పెట్టి చికెన్, మటన్ తినిపించటం అలవాటు చేస్తే.. పెద్ద అయ్యాక నరమాంస భక్షకులుగా మారే అవకాశం ఉందని గోపాల్ భార్గవ్ విమర్శలు చేశారు.

గుడ్డు మాంసాహారం అని డిసైడ్ అయిన ఎంపీ.. గుడ్డు తినటం కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆహారపు అలవాట్లకు వ్యతిరేకంగా నిర్ణయించటం కలకలం రేపుతుంది. ఓ ఎంపీ ఇలా మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది.

 

Related Posts