వాహన యజమానులు..,ఈ డాక్యుమెంట్ లేకపోతే బీమాను రెన్యూ చేసుకోలేరు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వాహన యజమానులు జాగ్రత్త..ఒకే ఒక డాక్యుమెంట్ లేకపోతే మీరు బీమాను పునరుద్ధరించలేకపోతారు. ఈ మేరకు ఢిల్లీ ఐఆర్డీఏఐ ఆదేశించింది. PUC సర్టిఫికేట్ లేకపోతే..బీమా పాలసీని రెన్యూవల్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.కానీ..అమల్లో మాత్రం వీలు కావడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లో సుప్రీం కోర్టు ఆదేశాల అమలు స్థాయి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఆందోళన వ్యక్తం చేసినట్టు ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

దీంతో మోటార్‌ బీమా పాలసీలను రెన్యువల్‌ చేసే సమయంలో పాలసీదారుల నుంచి చెల్లుబాటులో ఉన్న పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్‌ను కోరాలని సాధారణ బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తాజాగా ఆదేశించింది.ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు పాటించేలా చూడాలని బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ సూచించింది.

PUC అంటే…? 
పీయూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ అని అర్థం. వాహనం వెళ్ళడం వల్ల, దాని నుండి వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ ఎంతుంది ? పర్యావరణంకి ఎంత హాని జరిగే అవకాశం ఉంది ? గాలి కాలుష్యం అవుతుందా ? ఇంకా తదితర వివరాలతో తెలిపే పత్రం. దేశ, రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం నిర్దేశించిన యూనిట్లలోపు ఉంటేనే ఈ పొల్యూషన్ సర్టిఫికేట్(పీయూసీ) ఇస్తారు.కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం 1989 ప్రకారం ప్రతి వాహనం ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. ప్రతి వాహనం పీయూసీ పరీక్ష చేసి సంవత్సరం పాటూ ఎలాంటి సమస్య లేదని తేలితేనే ఆ వాహనాన్ని సదరు కంపెనీ విక్రయిస్తుంది. కొన్న మొదటి సంవత్సరం పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం లేదు. కాబట్టి సంవత్సరం తరువాత తర్వాత పీయూసీ తీసుకోవాల్సి ఉంటుంది.

పొల్యూషన్ సర్టిఫికేట్ సీరియల్ నంబర్, టెస్ట్ చేసిన వాహనం నంబర్ ప్లేటు, తేదీతో పాటు ఎప్పటివరకు పీయూసీ చెల్లుతుందో తేదీ వివరాలు, పొల్యూషన్ రీడింగ్ వివరాలు పీయూసీ లో పొందుపరుస్తారు.


Related Tags :

Related Posts :