ప్రభాస్ తమ్ముడిగా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Atharvaa in Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ కోలీవుడ్ యాక్టర్ అథర్వ మురళి అన్నదమ్ములుగా కనిపించబోతున్నారా? అవుననే వినిపిస్తుంది టాలీవుడ్‌లో. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమాలో హీరో బ్రదర్ క్యారెక్టర్ చాలా కీలకమట. దానికి న్యాయం చేయాలంటే అనుభవం ఉన్న నటుడైతే బావుంటుందని భావించి అథర్వని సంప్రదించారని సమాచారం.
నిడివి ఎంతున్నా.. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు అథర్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. అథర్వ, వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన‘గద్దలకొండ గణేష్‌’లో ముఖ్య పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

బుట్టబొమ్మ వచ్చేసింది.. మరి బ్యాచ్‌లర్‌ బాబు ఎక్కడ?..


పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ లాక్‌డౌన్‌కి ముందు యూరప్‌లో చిత్రీకరణ జరుపుకుంది. త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ పునఃప్రారంభం కానుంది. యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Related Posts