Home » ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని…
Published
6 days agoon
young girl commits suicde at Patancheruvu, due to love affair : ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకోటానికి నిరాకరిచటంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని పటాన్ చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మికి ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు శ్రావణి (21) డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటోంది.
శ్రావణి అదే గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి, అలియాస్ విక్కీ ప్రేమించుకున్నారు. ఈవిషయం తెలిసిన శ్రావణి మామ రాజశేఖర్ రెడ్డి… విక్కీతో పెళ్ళి విషయం మాట్లాడాడు. శ్రావణితో పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని విక్కీ చెప్పాడు. పెళ్లి చేసుకోనప్పుడు మా అమ్మాయి వెంటపడొద్దని మందలించటంతో అప్పటి నుంచి వెంకటరామిరెడ్డి శ్రావణిని కలవలేదు.
కాగా.. గత ఏడాది శ్రావణి మామ రాజశేఖర్ రెడ్డి మరణించటంతో,మళ్లీ విక్కీ ప్రేమిస్తున్నానంటూ శ్రావణి వెంట పడటం మొదలెట్టాడు. ఇది గమనించిన శ్రావణి తల్లి విజయలక్ష్మి, అభ్యంతరం చెప్పింది. మా అమ్మాయి వెంటపడొద్దని
విక్కీని మందలించింది. అప్పటినుంచి మళ్లీ విక్కీ కనపడటం మానేశాడు.
ఈక్రమంలో జనవరి 10న విజయలక్ష్మి పెదనాన్న చనిపోవటంతో కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వెళ్ళారు. కార్యక్రమం జరుగుతుండగా మధ్యాహ్నం సమయంలో శ్రావణి అక్కడినుంచి ఇంటికి తిరిగి వచ్చేసింది. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగివచ్చి చూసే సరికిశ్రావణి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ప్రేమించిన వ్యక్తి మోసం చేయటంతోనే తనకూతురు మనస్తాపంతో ఆత్మ హత్య చేసుకుందని విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.