ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకున్నాడు… పెళ్ళి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియురాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రేమ పేరుతో తనను వంచించి గర్బవతిని చేసిన యువకుడితో పెళ్ళి చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఒక యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేపట్టింది. కరీనంగర్ జిల్లా మానకోండూరు మండలం ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్లకు చెందిన రవళి అనే యువతి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో రవళి పెళ్లి చేసుకోవాలని సురేష్ ను కోరింది. అందుకు సురేష్‌ నిరాకరించాడు. దీంతో ఆదివారం తెల్లవారు ఝూమున సురేష్ స్వగ్రామమైన ఖాదర్ గూడెం వచ్చిన యువతి గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టింది. సురేష్‌తో తనకు పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తోంది. లేకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాగా… రవళికి ఇప్పటికే ఇద్దరితో పెళ్ళి అయ్యిందని మూడో వ్యక్తిగా సురేష్ ను ప్రేమించినట్లు స్ధానికులు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కూడా రవళి గ్రామ పంచాయతీ ఎదుట ఇదేవిధంగా ఆందోళన చేపట్టగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చెంజెర్ల పంపించివేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సురేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగస్టు2వ తేదీన తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి… దానితోపాటు ఓ లేఖ కూడా రాసింది. అయితే ఆమె బంధువులు వద్దని వారించడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది. మళ్లీ ఆదివారం తెల్లవారుఝూమున గ్రామానికి వచ్చి తాను మూడు నెలల గర్భవతినని చెపుతూ.. సురేష్‌తో పెళ్లి జరిపించే వరకు కదలనని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతోంది.

Related Posts