ఓ యువతి కథ : అభిషేక్ బచ్చన్ కోసం పిచ్చిదై పోయింది..ఆదుకున్న మహిళా పోలీస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పిచ్చిదైపోయింది..ఆదుకున్న పోలీసు
ఒక్క ఛాన్స్…అంటూ..సినిమాలో వేషం కోసం ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే..మరికొంతమంది అదే పనిగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మరికొంతమంది హీరోలను విపరీతంగా అభిమానిస్తుంటారు.

ఇలాగే ఓ యువతికి…అభిషేక్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టం. అతడినే పెళ్లి చేసుకుంటనని వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొట్టేది. ఈ క్రమంలో మానసికస్థితి కోల్పోయింది. చెన్నైలో ఓ చెత్తకుప్ప దగ్గర చింపిరి జుట్టు, చిరిగిన బట్టలతో ఉన్న ఈ అందమైన యువతిని చూసిన ఓ మహిళా పోలీసు మానవత్వంతో ఆదుకుంది.

చెన్నైలోని మాధవరం నిర్మానుష్యంగా ఉంది. కరోనా నేపథ్యంలో ఎవరూ తిరగడం లేదు. ఈ సమయంలో చెన్నై సచివాలయ ఉద్యోగుల క్వార్టర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే మహిళా ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరీ జీపులో గస్తీ తిరుగుతున్నారు. రోడ్డు పక్కగా ఉన్న చెత్త కుప్పతొట్టి వైపు దృష్టి మరలింది.

వెంటనే దిగి..అక్కడకు వెళ్లింది. చింపిరి జుట్టు, నలిగి మాసి, చిరిగిపోయిన చుడీదార్ దుస్తుల్లో అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె గురించి వివరాలు అడిగారు రాజేశ్వరి. తనకు ఆకలి వేస్తోందని చెప్పడంతో ప్లాస్క్ లో ఉన్న ఛాయ్ ని మొదట తాగించింది.

యువతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మహిళా కానిస్టేబుళ్లు స్నానం చేయించారు. అప్పటికే రాజేశ్వరి..కొత్త దుస్తులు తెప్పించారు. కడుపునిండా భోజనం పెట్టించింది. అనంతరం ఆమె గురించి ఆరా తీశారు ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి.
తన పేరు భారతి అని, చెన్నై శాస్త్రినగర్ లో తండ్రి జాబ్ చేసి రిటైర్ అయ్యారని, ప్రస్తుతం తల్లిదండ్రులు లేరని వెల్లడించింది.

చెన్నైలోని పులియంతోపులో అత్త ఉంటుందని చెప్పింది. వెంటనే పోలీసులు ఆమె ఆచూకి కనుగొని పీఎస్ కు తీసుకొచ్చారు. భారతిని అప్పగించే ప్రయత్నం చేయగా..అత్త నిరాకరించింది. ఈ క్రమంలో భారతికి చెల్లి ఉందని తెలిసింది. ఆవడిలో ఉన్న ఈమె ఇంటికి తీసుకెళ్లారు. ఈమె కూడా ఇంట్లో ఉంచుకోవడానికి నిరాకరించింది. గతంలో జరిగిన విషయాలు చెప్పింది.

కొడుంగయ్యూరులో ఉండేవాళ్లం. పెద్ద అక్కకు క్రికెట్‌ అన్నా, సచిన్‌ టెండూల్కర్‌ అంటే పిచ్చి. అతడినే పెళ్లి చేసుకుంటానని మొండికేసేది. అతనికి పెళ్లయిందని చెప్పి వారించాం. తర్వాత..యువరాజ్‌సింగ్‌పై మోజు పెంచుకుంది. అంతేగాకుండా పెళ్లాడుతానని చెప్పేదని తెలిపింది. 2008లో యువరాజ్‌సింగ్‌కు నిశ్చితార్థం జరగడంతో అదే రోజున ఆత్మహత్య చేసుకుంది.

2016లో రిటైరైన నాన్న కొద్ది కాలానికి మరణించారు. ఆ తరువాత అమ్మ కూడా చనిపోయిందని ఆమె ఇన్స్ పెక్టర్ రాజేశ్వరికి వివరించింది. భారతి ఓ కాలేజీలో BSC చదివిందని, ఈ సమయంలో సినిమాలపై అంటే ఇష్టమని వెల్లడించింది. అభిషేక్ బచ్చన్ అంటే మహా ఇష్టపడేదని, అతడినే చేసుకుంటానని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేదని తెలిపింది. దీంతో..క్రమక్రమేణా..పిచ్చిదానిలా తయారైపోయిందని తెలిపింది.

READ  పాక్ అందుకే తగ్గింది : మిస్సైల్ దాడులకు భయపడే అభినందన్ విడుదల

జరిగిందేదో జరిగింది..అక్కను ఉంచుకోవాలని చెప్పగా..తను గమనించడం తనవల్ల కాదని నిరాకరించింది.
చేసేది ఏమీ లేక…భారతిని మరలా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనాథ శరణాలయానికి ఫోన్‌ చేస్తే… ప్రస్తుతం కరోనా కారణంగా..కొత్త వారిని చేర్చుకోవడం లేదని చెప్పారు.

చివరకు చెన్నై కార్పొరేషన్ హెల్త్ సెక్షన్ లో పని చేస్తున్న మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ మోహన ప్రియకు ఫోన్ చేశారు రాజేశ్వరి. కరోనా పరీక్షలు చేసి ఏదో ఒక అనాథ శరణాలయానికి పంపిస్తానని హామీనిచ్చింది.

ఎంతో అందంగా ఉన్న ఈ అమ్మాయి..దుర్మార్గుల చేతికి చిక్కి ఉంటే…ఒళ్లు జలదరిస్తోందని ఇన్స్ పెక్టర్ రాజేశ్వరి వెల్లడించారు. ఈమె చేసిన పనికి అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పోలీసుల్లో కూడా మానవత్వం, దయ, జాలి ఉందని ఇన్స్ పెక్టర్ రాజేశ్వరి నిరూపించారు.

Related Posts