గంజాయి మత్తులో బ్లేడ్ తో దాడి చేసి పీక కోశాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

young man Attack with the blade : విజయవాడ రామవరప్పాడు హనుమాన్ నగర్ లో బ్లేడ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో ఓ యువకుడు..మరో యువకుడిపై బ్లేడ్ తో దాడి చేసి పీక కోశాడు. గంజాయి తాగుతున్న నలుగురు యువకుల్లో సురేంద్ర, హేమంత్ సాయి మధ్య వివాదం జరిగింది. దీంతో హేమంత్ సాయి.. సురేంద్రపై బ్లేడ్ తో దాడి చేసి పీక కోశాడు.తీవ్ర రక్తస్రావం కావడంతో సురేంద్ర పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ లోకి వెళ్లి లిఫ్టులో పడిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సురేంద్రను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు.


ఈ నగరానికి ఏమైంది.. గంజాయి మత్తులో హైదరాబాద్ యువత, చేతులారా జీవితాలు నాశనం


విజయవాడలో గంజాయి మత్తులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన సురేంద్ర పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడని మరో 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఇటు ఘటన జరిగిన రామవరప్పాడులో గత కొద్ది రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఆకతాయిల చేష్టలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

Related Tags :

Related Posts :