లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

హిజ్రాతో ప్రేమ,సహజీవనం..అంతలోనే ఇద్దరూ ఆత్మహత్య

Published

on

young man and hijra takes life tamil nadu over love affair

తనకంటే నాలుగేళ్లు పెద్ద వయస్సున్న ఓ  హిజ్రాపై మనసుపారేసుకున్న యువకుడు పెద్దలను ఎదిరించి మరీ ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఇంట్లో పెద్దవాళ్లు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లోంచి వచ్చేసి ఆమెతో కలిసి ఉంటున్నాడు. అలా నెలరోజుల పాటు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరూ శనివారం  (జూన్ 20,2020)న ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

పోలీసుల కథనం ప్రకారం..కారైక్కాల్‌ సమీపం తిరునల్లారుకు చెందిన దిలీప్‌ అనే 26 ఏళ్ల యువకుడికి నిరావీ ప్రాంతానికి చెందిన షివానీ అనే 30ఏళ్ల  హిజ్రాతో ఆరునెలల క్రితం పరిచయం ఏర్పడింది. తరచూ ఇద్దరు కలిసి తిరిగేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. 

ఈ విషయం దిలీప్‌ ఇంట్లో తెలిసింది. బుద్ధిలేదేరా..హిజ్రాతో తిరగటమేంటీ..మతిగానీ పోయిందా అంటూ గట్టిగా మందలించారు.మరోసారి ఆమెతో కలిసి తిరిగావని తెలిస్తే కాళ్లువిరగ్గొడతామని..ఇదేం తలనొప్పిరా మాకూ అంటూ తీవ్రంగా తిట్టారు. కానీ షివానీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దిలీప్ కు ఇవేవీ తలకెక్కలేదు. షివానీపై ప్రేమను వదులుకునేది లేదని స్పష్టం చెప్పేశాడు. తల్లిదండ్రులు నెత్తీనోరు కొట్టుకుని కొడుకుని వేడుకున్నారు..అయినా దిలీప్ వినలేదు.

అలా దిలీప్‌  ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వెతికించారు ఫలితం లేదు. అలా నెలరోజుల క్రితం ఇల్లువదిలిపెట్టి వెళ్లి దిలీప్ కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో షివానీతో కాపురం పెట్టాడు. నెల రోజులు బాగానే ఉన్నారు.  ఇంతలో ఏమైందోగానీ..శనివారం ఇద్దరూ వారు ఉంటున్న ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Read: సినిమాల్లో పోలీసు వేషాలు..నిజజీవితంలో కార్ల చోరీలు..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *