young man murdered a beautician after being forced to marry on illegal affair

అక్రమ సంబంధం : పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటంతో బ్యూటీషియన్ హత్య 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా జరిగిన హత్యల్లో వివాహేతర  సంబంధాల వల్ల జరిగే హత్యలు రెండో స్ధానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ  రాష్ట్రంలోని వరంగల్ లో జరిగిన 10మంది హత్యలకు కూడా వివాహేతర సంబంధమే కారణం అని  తేలింది. వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చేందుకు మొదలైన ఈ హత్యల పరంపర వింటేనే ఒళ్లు గగుర్పొడిచింది.  

ఒక నేరాన్నికప్పి పుచ్చుకునేందుకు 9 సామూహిక హత్యలకు పాల్పడ్డాడు నిందితుడు. జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్‌.సి.ఆర్‌.బి. గణాంకాల ప్రకారం 2018లో జరిగిన హత్యలు, వాటికిగల కారణాలను చూస్తే కుటుంబ వివాదాల వల్ల 2712  హత్యలు జరగ్గా… వివాహేతర సంబంధాల వల్ల 1658 హత్యలు జరిగాయి.వివాహేతర సంబంధాల నేరాలు  ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. 

తన కంటే 9 ఏళ్ళు చిన్నవాడైన వ్యక్తిని మోహించి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతడి చేతిలో హతమయ్యింది తమిళనాడులో ఒక బ్యూటీషియన్. తాత్కాలిక సుఖాల కోసం పెట్టుకుంటున్న ఇలాంటి సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. నిండు జీవితాలను అర్ధాతంరంగా ముగిస్తున్నాయి.  

లాక్ డౌన్ కారణంగా ప్రియుడి తో కలిగిన ఎడబాటును తట్టుకోలేని ప్రియురాలు ప్రియుడి కోసం తహతహలాడింది. ఇంటికి వచ్చి తన విరహతాపాన్ని తీర్చమని వేధించేది. ఆమె వేధింపులు తట్టుకోలేని ప్రియుడు నిద్రమాత్రలు ఇచ్చి ఆమెను మట్టుపెట్టాడు. 

తమిళనాడులోని తిరుప్పూరు జిల్లా ముత్తుకూరు కొడుముడి ప్రాంతానికి చెందిన యువరాజ్ (37) కు సంగీత (34)తో కొంత కాలం క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బ్యూటీషియన్ కోర్సు చేసిన సంగీత  బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.  రోజు ఇంటి నుంచి పార్లర్ కు వెళ్లి వచ్చే క్రమంలో  సంగీతకు  ఆ ఏరియాలో జులాయిగా తిరిగే వివేక్ అనే 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది.

బ్యూటీ పార్లర్ లో కస్టమర్లు లేనప్పుడు అక్కడకు వెళ్లి సంగీతతో కబుర్లు చెప్పేవాడు వివేక్. ఈ పరిచయం క్రమేపి వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. సంగీత ప్రతి రోజు వివేక్ తో మాట్లాడకుండా ఉండలేనంతగా  అతని ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది.  ఇక అప్పటినుంచి వారిద్దరూ అవకాశం చిక్కినప్పుడల్లా కలుసుకుని రాసలీలల్లో మునిగి తేలుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయసాగారు.

కొన్నాళ్లకు ఈ విషయం యువరాజ్ కు తెలిసింది.  పధ్ధతి మార్చుకోవాలని భార్య సంగీతకు చెప్పాడు. అయినప్పటికీ సంగీత వివేక్ తో  అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది.  భార్యతో రోజు గొడవలు పడితే కుటుంబ పరువు బజారున పడుతుంది…. పిల్లలు జీవితం నాశనం అవుతుందని చాలా కాలంగా భార్య చేసే పనులు తెలిసి మౌనంగా భరిస్తూ వచ్చాడు. తన  వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయింది కనుక ప్రియుడితో కలిసి లేచిపోదామనే ఆలోచనకు వచ్చింది సంగీత.  

ఒక రోజు  వివేక్ రాగానే తన మనసులో మాట ప్రియుడికి చెప్పింది. భర్త, పిల్లలను విడిచి వచ్చేస్తాను, ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా జీవిద్దాం అని చెప్పింది. అక్కడ బ్యూటీ పార్లర్ పెట్టుకుని నేనే సంపాదించి నిన్ను పోషిస్తాననే భరోసా కూడా ఇచ్చింది.  అయితే  శారీరక సుఖాల కోసం సంగీతతో  సంబంధం పెట్టుకున్నవివేక్  కు ఆమె ప్రపోజల్ నచ్చలేదు.  ఆమెను పెళ్లిచేసుకోటానికి అతని మనసు అంగీకరించలేదు. 

తనకంటే వయస్సులో పెద్దది కావటం… పైగా ఇద్దరు పిల్లల తల్లిని తాను పెళ్లి చేసుకోవటం ఏమిటనే ఆలోచనలోనూ పడ్డాడు.  క్రమేపి సంగీత నుంచి పెళ్లి చేసుకోమని వత్తిడి పెరగసాగింది.  దీంతో ఆమెను దూరం పెట్టసాగాడు. ఇంతలో  దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఏర్పాటు చేసిన లాక్ డౌన్ తో  ఎవరికి  వారు ఇళ్లకే పరిమితమయ్యారు.

రోజు చూసే ప్రియుడు కనపడక పోవటం. అతడితో ఎంజాయ్ చేయలేక పోవటం, భర్త ఇంట్లోనే ఉండటంతో విరహం తట్టుకోలేక పోతోంది సంగీత.  రోజూ ఫోన్ చేసి వివేక్ ను వచ్చి తన కోరిక తీర్చమని వేధించసాగింది. లాక్ డౌన్ అమల్లో ఉంటే ఎలా కుదురుతుంది….మీ ఆయన ఇంట్లో ఉన్నాడనే నెపంతో వివేక్ ఆమెకు దూరంగా ఉండసాగాడు.  

కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వటంతో ఒక రోజు సంగీత భర్త యువరాజ్ పనిమీద బయటకు వెళ్లాడు.  వెంటనే సంగీత వివేక్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరింది.  చాలా రోజులుగా విరహ తాపంతో ఉన్నసంగీత వివేక్ రాగానే అతడితో రాసలీలల్లో తేలియాడింది. ఆనందడోలికల్లో ఉండగానే సంగీత తన ప్రపోజల్ ను మళ్లీ వివేక్ ముందు పెట్టింది.

ఎక్కడికైనా వెళ్లి పోయి సంతోషంగా బతుకుగదాం అంటూ ఒత్తిడి చేసింది. ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని వివేక్ పధకం ప్రకారం తనతోపాటు తెచ్చుకున్న విషపు గుళికలు కూల్ డ్రింక్ లో కలిపి ఆమెతో తాగించాడు. ఆమె నిద్రలోకి జారు కున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన యువరాజ్ భార్య మంచంపై పడుకుని ఉండటం గమనించి ఆమెను లేపేప్రయత్నం చేశాడు.

ఆమె ఎంతసేపటికీ లేవక పోవటంతో డాక్టర్ని పిలిచి చూపించాడు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్ ప్రకటించాడు. భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసిన యువరాజ్, వివేక్ పై అనుమానం వ్యక్తం చేస్తూ  పోలీసులకు ఫిర్యాదు చేసాడు.  పోలీసులు వివేక్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిపై హత్యకేసు నమోదు చేసిపోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Read: నిద్రపోతున్న భార్యను చంపేయాలని త్రాచు పాముతో ప్లాన్

Related Posts