ఇంట్లో పనిచేయడం కంటే.. ఆఫీసుల్లో వర్క్ ఎంతో బెటర్ అంటున్న యువత..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అసలే కరోనా కాలం నడుస్తోంది.. అయినా బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. వ్యక్తిగత పనుల నుంచి ఆఫీసు వర్క్‌ల దాకా అన్ని నిత్యావసరమే. ఆఫీసుల్లోనూ కరోనా కేసుల ప్రభావం పెరిగిపోతూ వస్తోంది. కరోనా ప్రభావంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి.

అయినప్పటికీ చాలామంది యువ ఉద్యోగులు ఇంట్లో నుంచి వర్క్ చేయడం కంటే ఆఫీసులకు తిరిగి వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారంట… సౌకర్యవంతమైన పని చేయాలంటే అందుకు తగిన వాతావరణంలో ఆఫీసుల్లో మాత్రమే ఉంటుందని యువకుల్లో అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ఇంట్లోనే ఉండే కంటే.. ఆఫీసులకు వెళ్లి పనిచేయడమే కంపర్ట్‌గా ఉంటుందని ఫీల్ అవుతున్నారంట. ఒక్కో వయస్సు వారిలో ఒక్కో రకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది.
to head back to the officeహైదరాబాద్ నగరంలోని యువ ఉద్యోగుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంట్లో ఉండి పనిచేయాలంటే అంతగా కంపర్ట్‌గా ఉండదని, ఆఫీసుల్లో వర్క్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారంట.. అందుకే తిరిగి ఆఫీసులకు వెళ్లి వర్క్ చేయాలని కోరుకుంటున్నారని CivicScience అనే సర్వే వెల్లడించింది. ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా మరోవైపు ఆఫీసు వర్క్ విషయంలో రాజీ పడేందుకు 18ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారంతా ఇష్టపడటం లేదంట.. ఈ సర్వేలోని కొత్త డేటా ప్రకారం.. నగర యువతలో పురుషుల్లో 20 శాతం మంది మహిళల కంటే ఎక్కువగా ఆఫీసుల్లో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంట.

అందులోనూ యువకుల్లో 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్న వారంతా ఆఫీసులకు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారు. లాక్‌డౌన్ మొదలైనప్పటినుంచి ఉన్న ఆలోచనలో కంటే.. ఎత్తేసిన తర్వాత చాలామందిలో ఇదే ధోరణి కనిపిస్తోంది. 42 మంది నగర యువత (18-24) ఎక్కువ మంది ఆఫీసులకు తిరిగి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.

రీమోట్ వర్క్ వాతావరణంలో ఉండే కంటే ఆఫీసు లో వర్క్ ఎంతో బెటర్ అని ఫీల్ అయ్యే యువకులే ఎక్కువగా ఉన్నారంట. మరికొంతమంది ఈ రెండు ఆప్షన్లకు ఆసక్తి చూపిస్తున్నారంట.. మరికొంతమంది యువ ఉద్యోగుల్లో దాదాపు 44 శాతం మంది ఆఫీసుల్లో అంతగా సురక్షితం కాదనే అభిప్రాయపడుతున్నారు.

ఆఫీసుల్లో కంటే ఇంట్లో నుంచే వర్క్ చేయడం ఉత్తమమని భావిస్తున్నారు. 55 ఏళ్లు దాటి వారిలో 32 శాతం మంది మాత్రం తిరిగి ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారంట. వరుసగా 35 ఏళ్ల నుంచి 54 ఏళ్ల వయస్సులో ఆఫీసుల్లోకి వెళ్లాలని కోరుకుంటుండగా… 25 ఏళ్ల వయస్సు నుంచి 34 ఏళ్ల మధ్య కంటే నాలుగు, ఎనిమిది శాతం ఆఫీసు వర్క్ చేసేందుకు ప్రాధ్యానత ఇస్తున్నారని సర్వేలో తేలింది.

అలాగే కరోనా మహమ్మారి సమయంలో ఇంట్లో నుంచి పనిచేసేవారిలో 48 శాతం మంది మాత్రం ఎప్పటిలానే సురక్షితమైన వాతావరణంలోనే పనిచేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాక్సిన్ రాక ముందే ఆఫీసులకు తిరిగి వెళ్లేందుకు ఎంతమంది సౌకర్యవంతంగా ఫీల్ అవుతున్నారంటూ CivicScience సర్వే చేసింది.

ఇందులో 27 శాతం మంది చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పగా.. 17 శాతం మంది కొంత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. 11 శాతం మంది తటస్థంగా ఉంటే.. 20 శాతం మంది కొంత అసౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కానీ, 26 శాతం మాత్రం చాలా అసౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చాలా సౌకర్యవంతంగా భావించే వారితో పోలిస్తే ఒక శాతం తక్కువగా అసౌకర్యంగా భావించే వారు ఉన్నారు.

Related Tags :

Related Posts :