లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

దయా గాడి దండయాత్రకి అయిదేళ్లు.. ఐమాక్స్‌లో స్పెషల్ షో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రూపొందిన హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘టెంపర్’.. నేటితో అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

Published

on

Young Tiger NTR, Dashing Director Puri Jagganadh's High-voltage Blockbuster Temper Completes 5 Years

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రూపొందిన హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘టెంపర్’.. నేటితో అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన  హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘టెంపర్’..

తారక్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. 2004లో భారీ అంచనాలతో బాక్సాఫీసు బరిలో నిలిచిన ఈ సినిమా ఆశించినంత ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ కలయికలో మరో సినిమా రావడం కష్టమనుకున్నారంతా. అది నిజం కాదని, ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే పొందాలని నిరూపించారు ఈ ఇద్దరు. దాదాపు 11 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కు తమ ‘టెంపర్‌’ చూపించి రికార్డులు సృష్టించారు. బండ్ల గణేష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. 2015 ఫిబ్రవరి 13న విడుదలైన ఈ సినిమా 2020 ఫిబ్రవరి 13 నాటికి అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఈ సందర్భంగా.. ‘టెంపర్’ చిత్రానికి సంబంధించిన విశేషాలు..

TEMPER

 

పూరి కెరీర్‌లో మొదటిసారి..

పూరి జగన్నాథ్‌ తొలిసారి తన కెరీర్‌లో వేరే రచయిత అందించిన కథకు దర్శకత్వం వహించడం విశేషం. ఎప్పుడూ తన సొంత కథలతో సినిమాలు తెరకెక్కించే ఆయన ఇలా చేయడానికి కారణం రచయిత వక్కంతం వంశీ. ఈ సినిమా ప్రారంభం ముందు వంశీ తారక్‌కు ఓ పాయింట్‌ వినిపించాడు. అది బాగా నచ్చడంతో పూరికి తెలియజేశాడు తారక్‌. అప్పటికే పూరి ఓ కథ ఫైనల్‌ చేసినా.. నా కథ కంటే బావుంటే ఓకే చేస్తానని చెప్పాడు. అలా వంశీ చెప్పిన కథ పూరిని ఆకట్టుకోవడంతో ‘టెంపర్‌’ తెరకెక్కింది.

 

TEMPER

 

 కథ విషయానికొస్తే..

దయా (ఎన్టీఆర్‌) ఎవరు లేని అనాథ. చిన్నప్పటి నుంచి డబ్బంటే ఆశ. పోలీసుగా మారితే కానీ ఎక్కువ డబ్బు రాదనుకుని పోలీసు అవుతాడు. అలా పోలీస్ అయిన దయా.. డబ్బు కోసం విశాఖపట్నంలోని ఓ రౌడీ బృందంతో చేతులు కలుపుతాడు. అందులో ప్రముఖుడు వాల్తేర్‌ వాసు (ప్రకాశ్‌ రాజ్‌). వాసు చేసే అన్యాయాన్ని పట్టించకోకుండా, అతనుచేసే అక్రమాలను చూసీ చూడనట్టు ఉంటూ వాసు నుంచి కావాల్సినంత సొమ్ము తీసుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు యానిమల్ లవర్ శాన్వి (కాజల్‌) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు దయా.

ఆమె పరిచయంతో దయాలో మార్పొస్తుంది. శాన్వి పుట్టిన రోజున వాసు గ్యాంగ్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి చంపబోతారు. దయా అడ్డుపడతాడు. ఈలోగా వాసు వచ్చి మనం చంపాల్సింది ఈ అమ్మాయిని కాదు అంటాడు. ఆ రాక్షసుల బారి నుంచి లక్ష్మీ (మధురిమ)ని కాపాడమని దయాని అడుగుతుంది శాన్వి. దీంతో వాసు, దయా మధ్య దూరం పెరుగుతుంది. అప్పటి నుండి వాసు చేసే అక్రమాలకు దయా ఎదురుతిరుగుతాడు. దాంతో వాసు.. దయాపై వైరం పెంచుకుంటాడు. ఆ లక్ష్మీ ఎవరు? దయా.. వాసుని ఎలా అంతమొందించాడు?..

 

KAJAL

మర్చిపోలేని క్యారెక్టర్స్, గుర్తుండిపోయే సీన్స్.. 

* ఈ చిత్రంలో చిరకాలం గుర్తిండి పోయే పాత్రలు మూడున్నాయి. దయా (ఎన్టీఆర్‌), వాల్తేరు వాసు (ప్రకాశ్‌ రాజ్‌), మూర్తి (పోసాని కృష్ణ మురళి). తన పై అధికారి దయా చేసే అరాచకం నచ్చక బాధపడే ఓ కానిస్టేబుల్‌ పాత్రలో జీవించాడు పోసాని. (పూరి మొదట ఈ క్యారెక్టర్ కోసం ఆర్.నారాయణమూర్తిని సంప్రదించారు.. కానీ, ఆయన సున్నితంగా తరస్కరించారు). 

వాల్తేరు వాసుగా ప్రకాశ్‌రాజ్‌ విలనిజానికి ఎదురులేదు. ‘నా పేరు దయా.. నాకు లేనిదే అది’ అని ఎన్టీఆర్‌ చెప్పకనే చెప్పాడు. ఈయన నాయకుడా, ప్రతినాయకుడా తెలియడం కొంచెం కష్టమే.

* ఎన్టీఆర్‌ – పోసాని మధ్య నడిచే ప్రతి సన్నివేశం ఆలోచిపంజేస్తుంది.

* సినిమాకే ప్రధానంగా నిలిచే సన్నివేశం క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్‌. బాధితురాలికి న్యాయం జరిగేందుకు తప్పును తన మీద వేసుకుంటాడు తారక్‌. ఈ నేపథ్యంలో సాగే ప్రతి సంభాషణ ప్రేక్షకుణ్ని కట్టిపడేస్తుంది. క్లైమాక్స్‌లో తారక్ నటన హైలెట్..

 

TEMPER

పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్..
ఎన్టీఆర్‌ సినిమా అంటే డ్యాన్సులు ఉండాల్సిందే. అందుకే తన పంథా మార్చి తారక్‌తోనే కాదు యావత్తు సినీ ప్రేక్షకుల్ని తన సంగీతంతో ఉర్రూతలూగించాడు అనూప్‌ రూబెన్స్‌. ‘మీ తాత టెంటర్‌.. మీ అయ్య టెంటర్‌’ అంటూ ఫాస్ట్‌బీట్, ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే ప్రత్యేకం గీతం, ‘నిన్ను చూసి పడిపోయా’ లాంటి మెలోడి, ‘దేవుడా దేవుడా’ అంటూ హీరో క్యారెక్టర్‌ని తెలియచేసే నాయకా ప్రధాన్య గీతాన్ని అందించింది అదుర్స్‌ అనిపించాడు. ఇక మెలోడిబ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

2020 ఫిబ్రవరి 13న ఐమాక్స్‌లో స్పెషల్ షో..

‘టెంపర్’ చిత్రం అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2020 ఫిబ్రవరి 13న హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో రాత్రి 8 గంటలకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

తారక్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున #5YearsOfTemperMania హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ‘టెంపర్’ కథ ఆధారంగా రూపొందిచిన నవల బుక్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *