భార్య ఎక్కువ సేపు సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతోందని….

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిన్న చిన్న అనుమానాలు పెనుభూతాలై భార్య భర్తల బంధాలను దెబ్బతీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే పనులతో జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్య పై అనుమానంతో ఒక భర్త భార్యను హత్య చేసిన ఘటన తమిళనాడులోని హోసూర్ లో జరిగింది.

వెల్లూరు జిల్లా పల్లికొండకు చెందిన మణికందన్(30) హోసూర్ లోని చిప్ కోట్ లోని ఒక ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్లక్రితం బెంగుళూరు కు చెందిన సింధూజ(27) ని వివాహం చేసుకుని లక్ష్మీనారాయణ నగర్ లో కాపురం పెట్టాడు. వీరికి 3 ఏళ్ల పాప ఉంది.సింధుజ వాట్సప్ ద్వారా పరిచయం అయిన స్నేహితులతో తరచూ సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉండేది. మణికందన్ అందుక అభ్యంతరం చెప్పాడు.  పరిచయం లేని వ్యక్తులతో సెల్ ఫోన్ లో అంతంత సేపు ఎందుకు మాట్లాడటం….. ఆ అలవాటు మానుకోమని హితవు చెప్పాడు. అయినా ఆమె తన అలవాటు మానుకోలేదు.

కోటి ఇస్తేనే కాపురం, లేదంటే విడాకులే……భర్త ఇంటి ముందు భార్య ధర్నా


మణి కందన్ ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆమె ఎవరితోనో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉండటం అతడ్ని అసహనానికి గురిచేసింది. క్రమేపి భార్య ప్రవర్తనపై అనుమానం మొదలైంది. ఈక్రమంలో అక్టోబర్ 13 మంగళవారం మణికందన్ ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి సింధుజ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. అప్పటికే ఈవిషయమై భార్యా భర్తల మధ్య పలు మార్లు గొడవ జరిగింది.సెల్ ఫోన్ లో మాట్లాడే అంశంపై మణికందన్ మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని భార్య గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం సమీపంలోని పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులకు జరిగినదంతా వివరించి చెప్పాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసుల సింధుజ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మణికందన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.Related Tags :

Related Posts :