Young Woman Attacks Lover for Refusing Marriage Proposal in Krishna Dist

ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియురాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో సహజీవనం చేస్తున్నప్పటికీ పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదని ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి చేసింది. అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంలోని ఇంగ్లిష్‌పాలేనికి చెందిన యువతి ఓ కాలేజీలో పనిచేస్తోంది. గూడూరుకు చెందిన యువకుడు పెడన తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుండగా.. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.

రెండేళ్లుగా ఒకరొనొకరు ప్రేమించుకుంటుండగా.. వక్కలగడ్డ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ అపస్మారకస్థితిలో కనిపించగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.

ఆసుపత్రిలో యువకుడు మాట్లాడుతూ.. చివరిసారిగా కలిసి మాట్లాడుకుని విడిపోదాం అంటూ గ్రామానికి పిలిచి పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి చేసిందని, పెళ్లి చేసుకుని కలిసి బతుకుదామని, లేదంటే కలిసి చనిపోదామని చెబుతూ తనపై కత్తితో దాడిచేసిందని వివరించాడు. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు మింగిందని చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి స్పృహలోకి వస్తే కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. 

Read: అక్రమ సంబంధం : పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటంతో బ్యూటీషియన్ హత్య 

Related Posts