లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసిన ప్రియురాలు

Published

on

Young woman kills her boyfriend : తాను ప్రేమిస్తున్న వ్యక్తిలో మార్పు రాకపోవడంతో ఆ ప్రియురాలి మనస్సులో ధ్వేషం పెరిగిపోయింది. రెండు సంవత్సరాలుగా ఇరువురి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో పక్కా ప్రణాళికతో ప్రియుడిని హత్య చేసింది ప్రియురాలు. బైక్ పై వెనక కూర్చొన్న ఆమె..ప్రియుడిని కత్తితో పొడిచేసింది. తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడనే చనిపోయాడు. ఈ ఘటన కొవ్వూరు పట్టణంలో చోటు చేసుకుంది. తాడేపల్లిగూడానికి చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు (25), మలకపల్లికి చెందిన యువతి గర్సికూటి పావనిలు ప్రేమించుకుంటున్నారు. పావని డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.

కొన్ని సంవత్సరాలు తాడేపల్లి గూడెంలో ఉంది. ఈ సమయంలోనే..తాతాజీతో ప్రేమలో పడింది పావని. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ..ఇరువురి మధ్య విబేధాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో పావని తిరిగి మలకపల్లికి వచ్చేసింది. మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. తాజాగా పంగిడికి వచ్చిన పావని..తాతాజీని కలిసింది. పావనినిని మలకపల్లిలో దించేందుకు బైక్ పై వెళుతున్నాడు తాతాజీ. కాపవరం – ధర్మవరం గ్రామాల మధ్యన వెళుతుండగా..వెనుక కూర్చొన్న పావని..తెచ్చుకున్న కత్తితో తాతాజీ వీపులో పొడిచేసింది. కిందపడిపోయిన తాతాజీ మెడ, తలపై పొడవడంతో తాతాజీ..స్పాట్ లోనే చనిపోయాడు.

ఈ సందర్భంగా..గ్రామీణ సీఐ ఎం.సురేష్ మాట్లాడుతూ..రెండు సంవత్సరాల కిందట తాతాజీ రహస్యంగా తాళి కట్టాడని, బహిరంగంగా పెళ్లి చేసుకోవాలని పావని కోరడం జరిగిందని, ఈ క్రమంలోనే..ఒకరిపై ఒకరు కోపం, అనుమానం పెంచుకున్నారని వివరించారు. హత్య కేసుగా నమోదు చేసుకుని..తాతాజీ మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం కొవ్వూరు ఆసుపత్రికి తరలించామన్నారు. ఇదిలా ఉంటే..హత్యకు వినియోగించిన కత్తి ఘటనాస్థలంలో లభించింది. తమ కుమారుడు హత్యకు గురయ్యాడనే సమాచారం తెలుసుకున్న తాతాజీ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాతాజీ, పావనిల మధ్య ప్రేమ ఉందనే విషయం తమకు తెలియదని వాపోయారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *