లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మద్యం మత్తులో : జవాన్‌ ను హత్య చేసిన స్నేహితుడు

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. ఆర్మీ జవాన్‌ ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మద్యం మత్తులో స్నేహితుడు జవాన్‌ ను హత్య చేశాడు.

Published

on

youngster killed his friend Jawan

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. ఆర్మీ జవాన్‌ ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మద్యం మత్తులో స్నేహితుడు జవాన్‌ ను హత్య చేశాడు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. వల్లబ్‌నగర్‌లో ఆర్మీ జవాన్‌ ప్రేమ్‌కుమార్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మద్యం మత్తులో దుండగులతోపాటు స్నేహితుడు జవాన్‌ ను హత్య చేశాడు. పాతకక్షలతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు దిలీప్‌గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. జవాన్‌ హత్యతో నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది.   

ప్రేమ్‌కుమార్‌, దూదిమెట్ల దిలీప్ స్నేహితులు. గతంలో వీరిద్దరూ క్లాస్ మెట్స్. ఒకే ప్రాంతంలో నివాసముంటుండంతో మంచి మిత్రులుగా ఉంటున్నారు. ఇటీవలే ప్రేమ్ కుమార్ లీవ్ మీద నర్సంపేటకు వచ్చాడు. నిన్న ఇద్దరూ కలిసి మద్యం తాగేందుకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో దాడి చేసుకునే వరకు వచ్చింది.
 
వీరు మద్యం మత్తులో ఉన్న క్రమంలో గతంలో దిలీప్, ప్రేమ్ కుమార్ మధ్య జరిగిన గొడవ చర్చకు వచ్చింది. దాని విషయంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ తీవ్రతరం అయింది. దీంతో దిలీప్ సమీపంలో ఉన్న ఇంట్లోని కూరగాయలు కొసే కత్తిని తీసుకొచ్చి ప్రేమ్ కుమార్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ప్రేమ్ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స కోసం వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రేమ్ కుమార్ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి దిలీప్ ఒక్కడేకాదు అతనికి సంబందించిన అనుచరులు ఉన్నారని అనుమానిస్తున్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మద్యం ఏ విధంగా సేవించారు… మద్యంలో ఏమైనా కలిపారా, దిలీప్ వెనుక ఎవరెవరున్నారు.. పాతకక్షలేనా లేదా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దిలీప్ పోలీసులకు లొంగిపోయినట్టు, అతని దగ్గర నుంచి సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలుస్తోంది. అదే విధంగా దాడి జరిగిన నర్సంపేట ప్రాంతంలో సీపీ టీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్ ను కూడా రంగంలోకి దిగి దీనికి సంబంధించి క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. 
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *