కొత్త Cibil స్కోరింగ్ మెథడ్ : మీ క్రెడిట్ స్కోరు తగ్గిందేమో చెక్ చేసుకోండి!

Your credit score may change under new Cibil scoring method

మీ క్రెడిట్ స్కోరు ఎంత? జనవరి 2020 మధ్య నుంచి మీ క్రెడిట్ స్కోరు పడిపోయి ఉండొచ్చు ఓసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకూ ట్రాన్స్ యూనియన్ సిబిల్ నుంచి ఒకవేళ మీ క్రెడిట్ స్కోరు ఉన్నట్టుండి పడిపోతే షాక్ అవ్వకండి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (CIC) కొత్త సిబిల్ స్కోరింగ్ మెథడ్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్కోరింగ్ సిస్టమ్ కింద రుణదారులు, కార్డుదారుల క్రెడిట్ స్కోరు ఒక్కసారిగా తగ్గిపోయే అవకాశం ఉంది. క్యాలెండర్ ఇయర్ ప్రారంభం నుంచి క్రెడిట్ స్కోరు భారీగా తగ్గిపోనున్నాయి. గత జనవరిలో మొత్తం వినియోగదారుల్లో 60 శాతం మంది క్రెడిట్ స్కోరు 775, ఆపైన ఉన్నట్టు TransUnion Cibil's website నుంచి డేటా వెల్లడించింది. ఇప్పుడు కేవలం 37 శాతం వినియోగదారులు మాత్రమే 765కు పైగా క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నారు. ఇటీవలే కొత్త స్కోరింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టినట్టు తెలిపింది. 

36 నెలల క్రెడిట్ పై దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది. అంతకుముందు 24 నెలల కస్టమర్ల డేటాపై మాత్రమే స్కోరింగ్ లెక్కించడం ఉండేదని ట్రాన్స్ యూనియన్ సిబిల్ సీఈఓ, ఎండీ రాజేశ్ కుమార్ వెల్లడించారు. సిబిల్ క్రెడిట్ విజిన్ స్కోరు మూడో వర్షన్‌గా ఆయన పేర్కొన్నారు. క్రెడిట్ స్కోరు ఒక్కసారిగా తగ్గిపోయిందని కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దీని కారణంగా రుణాలను తిరస్కరించే అవకాశం ఉండదన్నారు. కొత్త స్కోరింగ్ మెకానిజంతో సిబిల్ అమలు చేసినట్టు తెలిపారు. తమ రుణ విధానాలను మార్చేందుకు బ్యాంకుల సభ్యులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs)లతో కలిసి CIC పనిచేసినట్టు చెప్పారు. 

ఈ కొత్త విధానం ద్వారా క్రెడిట్ స్కోరు రిక్వైయిర్మెంట్ తగ్గించినట్టు తెలిపారు. పాత క్రెడిట్ స్కోరు, కొత్త క్రెడిట్ స్కోరు మధ్య తేడాను గుర్తించేందుకు తమ పొర్ట్ ఫోలియోను విశ్లేషించినట్టు జనరల్ మేనేజర్ చెప్పారు. అంతకుముందు క్రెడిట్ స్కోరు వెర్షన్ ప్రకారం.. అత్యల్ప స్కోరు 724 వరకు ఉంటే.. ఇప్పటి నుంచి 701 క్రెడిట్ స్కోరును అంగీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రెండింటి స్కోరు మధ్య అల్గారిథమ్స్ మారడం కారణంగా కచ్చితమైన క్రెడిట్ ఉన్నప్పటికీ కూడా మీ క్రెడిట్ స్కోరు పడిపోతుందని చెప్పారు. 

Read: నెల వ్యవధిలో 5వ డీల్...జియోలో KKR రూ.11,367కోట్ల పెట్టుబడి

మరిన్ని తాజా వార్తలు