ప్రియురాలి కళ్లల్లో ఆనందం కోసం ఆమె భర్తను…..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

mumbai:పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కన్నీళ్ళు తుడవాలనుకున్నాడు…ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు… కానీ చేసిన పనికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యాడు.
ముంబైలోని సమతా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సచిన్ యాదవ్ అనే వ్యక్తికి ఓ వివాహిత మహిళతో పరిచయం ఉంది. ఆమెకు పెళ్ళి కాకముందు నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయినా ఆమె వేరోకరిని పెళ్లి చేసుకుంది. అయునప్పటికీ తన మాజీ ప్రియుడు సచిన్ యాదవ్ తో రిలేషన్ కొనసాగిస్తూనే ఉంది.

ఈ క్రమంలో ప్రియురాలి భర్త ఆమెను హింసిస్తున్నాడని తెలుసుకున్నాడు. తన ప్రియురాలిని సంతోష పరచటానికి , ఆమె కళ్లల్లో ఆనందం చూడటానికి ఏదైనా చేయాలనుకున్నాడు. ఆమె భర్తకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. గత శనివారం ప్రేయసి భర్త ఓ బర్త్ డే పార్టీకి వెళతాడని తెలుసుకున్నాడు. ఆ పార్టీకి తన సోదరుడు సాగర్, గుప్తలను తీసుకుని వెళ్ళాడు.
కరోనా కారణంగా మాస్కలు ధరించి ఉండటంతో ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్రత్త పడ్డారు. ప్రియురాలి భర్త వద్దకు వెళ్లి అతడి పై దాడి చేసి రెండు చేతులు విరిచేశారు. అనంతరం తలపై గాయం చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.

మాస్కులు ధరించి ఉండటంతో నిందితులను గుర్తించటం కష్టం అయ్యింది. అయినప్పటికీ బాధితుడు, పొరిగింటి వారు ఇచ్చిన సమాచారంతో సచిన్, ఆకాష్, సాగర్ పేర్లు వెలుగు లోకి వచ్చాయి. దీంతో పోలీసులు సచిన్, ఆకాశ్ లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నిజం ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న మూడో వ్యక్తి సాగర్ కోసం గాలింపు చేపట్టారు.Related Posts