మద్యంమత్తులో యువకుల ర్యాష్ డ్రైవింగ్.. సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీకొట్టిన కారు…బైకిస్టు అక్కడికక్కడే మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

youth rash driving : హైదరాబాద్ మాదాపూర్ లో మద్యం మత్తులో ఓ యువకుడి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అర్ధరాత్రి వరకు పబ్ లో మద్యం తాగి రోడ్డుపై అతి వేగంగా బెంజీ కారును నడిపారు. సైబర్ టవర్ సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకిస్టు అక్కడికక్కడే గౌతమ్ దేవ్ మృతి చెందారు. అతని భార్య చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాశీవిశ్వనాథ్, అతడి స్నేహితుడు కౌశిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యంమత్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా బెంజీ కారు నడిపిన వ్యక్తే ప్రమాదానికి కారణమని గుర్తించారు.కాశీవిశ్వనాథ్ అతని స్నేహితుడు కౌశిక్ సాఫ్టే వేర్ ఇంజినీర్లు పబ్ లో మద్యం సేవించారు. అక్కడి నుంచి కూకట్ పల్లి వైపు భోజనం చేయడానికి వెళ్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో వారు వెల్లడించారు. మద్యంమత్తులో కారు ఎలా డ్రైవ్ చేస్తున్నామన్న స్పృహ కూడా లేదు.

వారు పూర్తిగా మద్యం సేవించారని పోలీసులు చెబుతున్నారు. అతివేగంగా కారు నడిపిన వారిపై ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వారిపై కేసు నమోదు చేశారు. డ్రంక్ డ్రైవ్ చేయడం దానితోపాటు వ్యక్తి మరణానికి కారణమవ్వడంతో మోటారు వెహికిల్ యాక్ట్ ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు.

Related Tags :

Related Posts :