ఇండియాలో YouTube నుంచి కొత్త TikTok యాప్ వచ్చిందోచ్..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుదారుల్లో ఒకటైన యూట్యూబ్ నుంచి కొత్త యాప్ ప్రవేశపెట్టింది.. ప్రత్యేకించి భారతీయ యూట్యూబ్ యూజర్ల కోసం ఈ వీడియో షేరింగ్ యాప్ తీసుకొచ్చింది.. అచ్చం చైనా టిక్ టాక్ యాప్ మాదిరిగానే ఉంది ఈ యాప్.. ఇంతకీ అదేంటంటే? ‘Youtube Shorts’ న్యూ షార్ట్ ఫామ్ వీడియో క్రియేటర్ పేరుతో రిలీజ్ చేసింది.చైనీస్ వీడియో షేరింగ్ అప్లికేషన్ టిక్ టాక్‌కు పోటీగా యూట్యూబ్ ఈ కొత్త Youtube Shorts అప్లికేషన్ ప్రవేశపెట్టింది. Verge రిపోర్టు ప్రకారం.. ఈ యూట్యూబ్ షార్ట్స్ (Youtube Shorts) అప్లికేషన్ ద్వారా యూజర్లు 15 సెకన్ల వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు.. మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఈ వీడియోలకు మ్యూజిక్ కోసం యూట్యూబ్ ఇన్ ప్రొడెక్ట్ మ్యూజిక్ పిక్కర్ ఫీచర్ ద్వారా పొందవచ్చు.. ఈ Musick Picker ఫీచర్ ప్రస్తుతం 1 లక్ష మ్యూజిక్ ట్రాక్ లు కలిగి ఉంది. ఇందులో మ్యూజిక్ ఆర్టిస్టులు, లేబుల్స్, పబ్లిషర్ల కోసం సొంతంగా కంటెంట్ అప్ డేట్ చేసుకోనేలా ఆప్షన్ కూడా ఇవ్వనుంది. ఇండియాలోని యూట్యూబ్ యూజర్లను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించే దిశగా ప్రయత్నిస్తోంది యూట్యూబ్.. ఇందుకోసం కొత్తగా ‘Create’ అనే ఐకాన్ స్పాట్ కూడా తీసుకొచ్చింది.ఈ యాప్ లో ప్రధానంగా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ Shorts betaలో ఈ యాప్ Create Icon ముందుగా ప్రవేశపెట్టింది.. అతి త్వరలో iOS డివైజ్ ల్లోనూ తీసుకొచ్చేందుకు యూట్యూబ్ ప్లాన్ చేస్తోంది. ఇండియాలో మాదిరిగా అమెరికా సహా ఇతర దేశాల్లో ఈ Shorts యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు కానీ, మన ఇండియాకు మాత్రం ముందే తీసుకొచ్చింది…

Related Posts