YouTube star Narayana Reddy of Grandpa Kitchen dies at 73. Internet is teary-eyed

పెద్దాయన.. యూట్యూబ్ స్టార్ ‘గ్రాండ్‌పా’ ఇక లేరు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆయనో యూట్యూబ్ స్టార్. యూట్యూబ్ యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు గ్రాండ్‌పా నారాయణ రెడ్డి. గ్రాండ్ పా కిచెన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంతో పాపులారిటీ సాధించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్దాయన గ్రాండ్‌పా (73) అక్టోబర్ 27న కన్నుమూశారు. నెట్టింట్లో రుచికరమైన వంటలు చేయడంలో తిరుగులేని వ్యక్తిగా పేరొందిన ఆయన తన కమ్యూనిటీకి చెందిన అనాథ చిన్నారులకు ఆహారాన్ని అందించేవాడు. 

ఆగస్టు 2017లో గ్రాండ్ పా కిచెన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. రుచికరమైన వంటలను తయరుచేస్తూ 60లక్షల మంది సబ్ స్ర్కైబర్లను సంపాదించుకున్నారు. గ్రాండ్ మరణ వార్తను ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిసిన యూజర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలాల్లో కూర్చొని రుచికరమైన వంటలను తయారుచేస్తూ ఎన్నో వీడియోలు చేశాడు. 

గ్రాండ్ పా ఫుడ్ మెనూలో ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉండేవి. ప్రత్యేకించి ఆయన వండే చికెన్ బిర్యానీ, పిజ్జా, బర్గర్లు, చికెన్ లాలీపప్స్, క్రిస్పీ పొటాటో ఫింగర్లంటే యూట్యూబ్ యూజర్లు అమితంగా ఇష్టపడతారు. తియ్యని వంటకాల్లో ఒరియో, కిట్ క్యాట్ మిక్స్ చేసిన చాకొలేట్ కేక్, రెడ్ వాల్వెట్ కేక్ చూస్తే లొట్టలేసుకుని తినాలనిపించేలా ఉంటాయి. 

అద్భుతమైన వంటలు చేసే నారాయణ రెడ్డిని.. గ్రాండ్ పా అని ముద్దుగా పిలుచుకుంటారు. వంటలు వండిపెట్టే పెద్దాయన ఇక లేడన్న వార్తను ఆయన ఛానెల్ యూజర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్విట్టర్ వేదికగా గ్రాండ్ పా మృతిపట్ల నివాళులు అర్పిస్తున్నారు. ప్రత్యేకించి గ్రాండ్ పా తయారుచేసిన కొన్ని వీడియోలను యూజర్లు ట్విట్టర్ వేదికగా గుర్తుచేసుకుంటున్నారు.  

Related Posts