లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ట్రంప్ కు మరో షాక్, ఈసారి యూ ట్యూబ్

Published

on

YouTube Suspends Trump Channel : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై అక్కడి టెక్ కంపెనీలు వరుసగా కొరడా ఝళిపిస్తున్నాయ్‌. తమ వేదికలను వినియోగించేందుకు వీలు లేకుండా ఫేస్‌బుక్, ట్విటర్ సంస్థలు ఇప్పటికే ట్రంప్‌‌పై నిషేధం విధించాయి. ఈ జాబితాలోకి తాజాగా యూట్యూబ్ కూడా వచ్చి చేరింది. ట్రంప్‌కు చెందిన ఛానెల్‌పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆ ఛానల్‌లో ఉన్న ఓ వీడియోను కూడా డిసేబుల్ చేసింది.

కనీసం ఏడు రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని యూట్యూబ్ తెలిపింది. అయితే.. ఈ నిషేధాన్ని మరింత కాలం పాటు కొనసాగించేందుకు యూట్యూబ్ ఈ రకమైన ప్రకటన చేసి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. కాగా.. ట్రంప్‌కు చెందిన అకౌంట్లపై ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విచ్, రెడ్డిట్‌ ఇప్పటికే వేటు వేశాయి. యూట్యూబ్ కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలంటూ హాలీవుడ్ స్టార్లు, ఇతరు ప్రముఖుల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు వెల్లువెత్తాయి.

దీంతో యూట్యూబ్‌ కూడా మిగతా సామాజిక మాధ్యమాల నిర్ణయాన్నే అమలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో హింస చెలరేగే అవకాశం ఉండటంతో ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఛానల్‌లోని కామెంట్ సెక్షన్ కూడా డిసేబుల్ చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *