లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

వైఎస్ వివేకా హత్య కేసు, రికార్డులు సీబీఐకి ఇవ్వాలన్న హైకోర్టు

Published

on

YS Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ సందర్భంగా రికార్డులను సీబీఐకి అందచేయాలని సూచించింది. రికార్డులను తమకు అందచేయాలని పులివెందుల మెజిస్ట్రేట్ ను సీబీఐ ఆశ్రయించింది. హత్య కేసుకు సంబంధించిన రికార్డులను ఇవ్వాలని తమకు ఆదేశాలు లేవని మెజిస్ట్రేట్ వెల్లడిస్తోంది. దీంతో రికార్డులు తమకు అందేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.ఈ కేసును సీబీఐ లోతుగా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. పలువురిని ఇప్పటికే విచారించింది కూడా. అంతకు ముందు సిట్ విచారించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ కేసు విచారణ చేపట్టగా…పులివెందుల, కాణిపాకం, కదిరి తదితర ప్రాంతాలకు సీబీఐ అధికారులు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో..విచారణ చేపడుతున్న బృందంలో కొందరు కరోనా వైరస్ బారిన పడడంతో విచారణకు తాత్కాలిక బ్రేక్ పడింది. తాజాగా కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడంతో…ఈ కేసు విచారణ చేపట్టింది. రికార్డులు ఇవ్వాలని హైకోర్టు సూచించడంతో విచారణ మరింత స్పీడ్ గా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు.
2019 మార్చి 15న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల ముందు వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయగా.. విచారణలో ఆశించిన పురోగతి లేకపోవడం, హంతకులేవరో తేల్చకపోవడంతో.. సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా భార్య, జగన్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో 62మంది సాక్షులను సిట్ విచారించినప్పటికీ, నేరస్తులు ఎవరనే దిశగా ఆధారాలు సేకరించలేకపోయింది.
వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణను వేగవంతం చేసింది.వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్యకు నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అందుకు న్యాయమూర్తి కిశోర్ కుమార్ అనుమతి ఇచ్చారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో సిట్ వేధిస్తోందంటూ కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.వివేకా హత్య కేసు విషయంలో ఆధారాలు సేకరించలేకపోయిన కారణంగా పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సాక్ష్యాలు తారుమారుచేశారనే అభియోగంతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ పై కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. 90 రోజుల రిమాండ్ అనంతరం వీరికి జూన్ 27న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *