ysr arogyasri in other states

హాస్పిటల్స్ లిస్ట్ విడుదల : పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై,

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. నవంబర్ 1, 2019 నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌ ఆసుపత్రుల డాక్టర్లు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. చికిత్సల విధానం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఏపీకి చెందిన వారిని బాగా చూసుకోవాలని డాక్టర్లను కోరారు జగన్. ఎంతో నమ్మకంతో చికిత్స కోసం ఏపీ నుంచి వచ్చారని.. వారు కోలుకునే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చిన కార్యక్రమం అని డాక్టర్లు అన్నారు. అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. 

ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపుతో ఏపీకి చెందిన పేదలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో సెలెక్టెడ్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందొచ్చని అధికారులు తెలిపారు. 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ 3 నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటి వరకు సొంత రాష్ట్రంలో సరైన వైద్య సేవలు లభించక, ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు లేక రాష్ట్రంలోని వేలాదిమంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్న ఏపీకి సంబంధించిన పేదలు రాష్ట్రంలో లేదా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో వైద్యసేవలు పొందొచ్చు. ఇతర రాష్ట్రాల్లో వైద్యసేవలు అందించే విషయంపై ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

2020 జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ జాబితాలో 1,200 జబ్బులకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. వైద్య చికిత్సలు కాస్ట్లీగా మారిన ఈ రోజుల్లో.. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పేదలకు చాలా ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.

Related Posts