లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో అధికారి పార్టీ క్లీన్ స్వీప్

Published

on

Pulivendula Panchayat elections : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయకేతనం ఎగురవేశారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో నూటికి నూరు శాతం సర్పంచ్‌ స్థానాలను దక్కించుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కలేదు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సొంత పంచాయతీ కసనూరులో టీడీపీ మద్దతుదారుడు పోటీ ఇవ్వలేక పరాజయం పాలయ్యాడు. ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోయింది.

పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా గెల్చుకున్నారు. 5 మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ అభిమానులే విజయదుందుభి మోగించారు. కేవలం 8 గ్రామ పంచాయతీల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు పోటీలో నిలిచారు. ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. నంద్యాలంపల్లి, పైడిపాలెం, దుగ్గనగారిపల్లె పంచాయతీలలో మొత్తంగా కేవలం 6 వార్డులే ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు దక్కాయి.

సొంత నియోజకవర్గం పులివెందులలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టారు. రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీఎంతో చర్చించి అభివృద్ధి పనులకు నిధులు తెప్పించడంలో ముందుంటున్నారు. స్థానిక ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పట్టారు.

పులివెందులలో 100 శాతం పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో భిన్నమైన ఫలితాలు రావడంపై చర్చనీయాంశంగా మారింది. కుప్పం నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉండగా 89 పంచాయతీలకు మూడవ విడతలో ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు కేవలం 14 పంచాయతీల్లోనే గెలిచారు. ఓట్ల పరంగా చూస్తే అధికార పార్టీ మద్దతుదారులకు ఏకంగా 31 వేల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కేవలం 14 పంచాయతీలకు మాత్రమే పరిమితమయ్యారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *