ఆ రెండు వర్గాలకే ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలనుకుంటోన్న వైసీపీ సర్కార్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మండలి వద్దు.. రద్దే ముద్దని ఇప్పటికే డెసిషన్ తీసుకుంది జగన్ సర్కార్. ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఈ లోగా ఎమ్మెల్సీలను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. ఇంకేం.. ఆశావహుల్లో కాలిక్యులేషన్స్‌ మొదలయ్యాయి. ఈసారి మండలిలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమేనంటోన్న కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ముఖ్యమంత్రి మనసులో ఏముంది? హామీలిచ్చిన వాళ్ల ఆశలు నెరవేరుస్తారా? సామాజిక సమీకరణాల్లో కలిసొచ్చేదెవరికి?

ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. గవర్నర్ కోటా రెండు.. పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో మరో 2 స్థానాలతో మొత్తం 4 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ముందుగా గవర్నర్ కోటా స్థానాలను 2 రోజుల్లో ప్రకటన చేయనుంది ప్రభుత్వం. జులై 15న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఇద్దరు కొత్త ఎమ్మెల్సీల పేర్లు ఫైనల్‌ చేయనున్నారు. ఆ తర్వాత గవర్నర్ కు ప్రభుత్వం సిపార్సు చేయనుంది.

ఆ ఇద్దరు నేతలు ఎవరన్న దానిపై వైసీపీలో హాట్‌హాట్‌ చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల కోసం వైసీపీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ఎన్నికలకు ముందు టికెట్ త్యాగాలు చేసిన వాళ్ళు.. పార్టీకి ముందు నుంచి సేవలు అందించినవాళ్లు.. ఇలా 25 నుంచి 30మంది నేతల దాకా ఉన్నారు. వీరిలో చాలామందికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. వాళ్లంతా అవకాశం తమకే దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా లెక్కలేసుకుంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

నాలుగు స్థానాల్లో రెండు స్థానాల కేటాయింపుపై సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటా రెండు స్థానాల్లో ఒకటి కమ్మ మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఫైనల్ చేశారని సమాచారం. కమ్మ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరు దాదాపు ఫైనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. మరో స్థానం వెస్ట్ గోదావరి జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోసేన్ రాజు లేదంటే మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు పేరు ఉందట. మోసేన్ రాజు పార్టీకి మొదటి నుంచి వీర విధేయుడిగా ఉన్నాడు. నమ్మకస్తుడనే ఇమేజ్‌ కూడా సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకే ఛాన్సెస్‌ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయనకే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన మరో రెండు స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ స్థానాలపై కూడా జగన్ ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒకటి కాపు సామాజిక వర్గానికి, మరొకటి చేనేత సామాజిక వర్గానికి ఇవ్వనున్నట్టు సమాచారం. కాపు సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు ఇచ్చే అవకాశముంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గ బాధ్యతలు ఇప్పటికే తోట త్రిమూర్తులుకి అప్పగించిన జగన్.. ఎమ్మెల్సీకూడా ఇవ్వనున్నారట.

READ  కరోనా ఎఫెక్ట్ : ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత

అశావహుల లిస్ట్‌ చాంతాడంత ఉన్నా నలుగురికి మాత్రమే ఎమ్మెల్సీ అవకాశం దక్కనుంది. రోజుకో పేరు తెరపైకి వస్తుండడంతో ఆశావహులు హైకమాండ్‌ దృష్టిలో పడేందుకు తమ వంతు ప్రయత్నాలకు పదునుపెట్టారు. మొత్తానికి మండలి రద్దు అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉండడంతో నిర్ణయం తీసుకునేలోగానే పదవుల్ని భర్తీ చేయాలని భావిస్తున్నారు సీఎం జగన్. అలాగే ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చినట్టు అవుతుందనే ఆలోచనలో ఉన్నారట.

Related Posts