నన్ను పంపించే కుట్ర జరుగుతోంది, వీలైతే షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోండి.. వైసీపీ ఎంపీ రఘరామ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం అధికార పార్టీతో పాటు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వైఖరి వైసీపీ నాయకులకు తలనొప్పిగా మారింది. రఘురామకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం వివాదాన్ని మరింత పెంచింది. షో కాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఢిల్లీకి వెళ్లిన రఘురామ కృష్ణ రాజు కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ఇవాళ(జూన్ 27,2020) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలను కలిశారు. జరుగుతున్న పరిణామాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారాయన. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత రఘురామ మీడియాతో మాట్లాడారు.

నాకు, మా పార్టీ అధ్యక్షుడికి మధ్య మనస్పర్థలు క్రియేట్ చేస్తున్నారు:
తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తని, పార్లమెంటు సభ్యుడిని అని రఘురామ చెప్పారు. పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా తాను ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తన గురించి ఎంపీ విజయసాయిరెడ్డి తన మీడియాలో, సోషల్ మీడియా, సామాజికవర్గానికి చెందిన గ్రూపుల్లో తప్పుడు, దొంగ రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. నన్ను పార్లమెంటు సభ్యత్వం నుంచి వాలంటరీగా వెళ్లిపోయినట్టు చిత్రీకరించాలని ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. షోకాజ్ నోటీసులో ఏముంది? రిప్లయ్ ఇవ్వాలా? లేక ఏం జరిగిందో వివరణాత్మకంగా సీఎం జగన్ కి తెలియజేయాలా? అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు రఘురామ తెలిపారు. అసలేం జరిగింది అనేదాని గురించి పార్టీ అధ్యక్షుడు జగన్ కి తెలియజేస్తానని రఘురామ వెల్లడించారు.

మీడియాతో ఎంపీ రఘురామకృష్ణ రాజు:
* రాజ్ నాథ్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశా
* ఎలక్షన్ కమిషన్ విధివిధానాలు, రూల్స్ తెలుసుకోవడానికే కమిషన్ సభ్యులను కలుసుకున్నా
* ఎలక్షన్ కమిషన్ సభ్యులను, కేంద్ర మంత్రులను కలవడం కోసమే ఢిల్లీ వచ్చా
* ఎవరినైనా కలిస్తే కలిశానని చెబుతా
* ఎవరిని కలుస్తానో మీడియాకి ముందే చెప్పలేను
* ఏం జరిగింది అనేది మా సీఎంకి కచ్చితంగా చెబుతా
* షోకాజ్ నోటీసులో ఏముంది? రిప్లయ్ ఇవ్వాలా? వివరణాత్మకంగా సీఎంకి తెలియజేయాలా అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నా
* అసంబద్దంగా పార్టీని, అధ్యక్షుడిని పల్లెత్తు మాట అననప్పటికి, విజయసాయి రెడ్డి తన సోషల్ మీడియాలో లేని పోని అపోహలు కల్పించి వార్తలు రాయించి నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు
* నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను, పార్లమెంటు మెంబర్ ని

* మీరు ఎన్ని దొంగ రాతలు రాయించినా నేను వ్యరేకించ లేదు, పార్టీ అధ్యక్షుడిని వ్యతిరేకించ లేదు
* విజయసాయి రెడ్డి వారి సోషల్ మీడియాలో, వారి సామాజికవర్గానికి చెందిన గ్రూపుల్లో లేనిపోని అపోహలు కల్పించి నా గురించి తప్పుడు, దొంగ వార్తలు రాయిస్తున్నారు
* ఆ వార్తలు చూపించి నాకు షోకాజ్ నోటీసులు ఇప్పించారు
* నన్ను పనిష్ చేయాలన్న మీ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు
* నాకూ, పార్టీ గౌరవ అధ్యక్షుడి మధ్య మనస్పర్థలు క్రియేట్ చేయొద్దు
* షోకాజ్ నోటీసుల విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నా
* నన్ను పార్లమెంటు సభ్యత్వం నుంచి వాలంటరీగా వెళ్లిపోయినట్టు చిత్రీకరించాలని ట్రిక్స్ ప్లే చేస్తున్నారు
* నా ఇష్యూ వల్లే ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ వరుసగా భేటీలు అవుతున్నారు
* నా వంతు ఎప్పుడు వస్తుందో తెలీదు
* విజయసాయి రెడ్డి తప్పుడు రాతలు రాయించడం సరికాదు
* నేను ఏనాడు కూడా పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు
* నేను ఏనాడూ పార్టీని కానీ, సీఎంని కానీ వ్యతిరేకించ లేదు, వ్యతిరేకించ బోను కూడా

Related Posts