ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లోక్ సభ స్పీకర్‌తో వైసీపీ ఎంపీల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాను కోరినట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పీకర్ చెప్పారని తెలిపారు. స్పీకర్‌తో 20 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో వైసీపీ ఎంపీలు ఎంపీ రఘరామకృష్ణం రాజు వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీలందరూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనేవి ఒక ఫౌండేషన్‌గా పేర్కొన్నారు. స్పీకర్ ను కలిసిన వారిలో ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేశ్, లావు కృష్ణ దేవరాయులు ఉన్నారు. రఘురామకృష్ణం రాజు స్పపక్షంలో విపక్షంలా వ్యవహరించారని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డారని విమర్శించారు. వైసీపీలో ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరిపారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు అనర్హత వేటు పిటిషన్ దాఖలు చేశామన్నారు. రఘురామ కృష్ణం రాజు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఏదైనా విషయంపై స్పష్టత కావాలంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలన్నారు. కేసులు ఉండటం, లాభాపేక్షతోనే రఘురామ కృష్ణం రాజు ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీ అధ్యక్షుడికి తెలియజేయాలని చెప్పారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దనని అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఉంటుందని విజయ సాయి తెలిపారు. రఘురామకృష్ణం రాజుకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని మిథున్ రెడ్డి అన్నారు. ఏ విషయంలోనూ కూడా రఘురామకృష్ణం రాజుకు జగన్ తక్కువ చేయలేదన్నారు. ఇచ్చిన విలువను రఘురామకృష్ణం రాజు కాపాడుకోలేకపోయారని మిథున్ రెడ్డి తెలిపారు.

Read:ఢిల్లీలో వైసీపీ ఎంపీలు.. రఘురామ స్పందన ఇదే!

Related Posts