టేక్ అవే సేవలపై నో కమిషన్ : జొమాటో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Zomato makes its takeaway service free : రెస్టారెంట్ల వద్ద లభించే టేక్ అవే సేవల విషయంలో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. సున్నా కమిషన్ కే అందించనున్నట్లు వెల్లడించింది. హోటళ్లు మళ్లీ మునపటి స్థాయికి చేరుకోవాలని ఇది తోడ్పడుతుందని భావిస్తున్నట్లు, కరోనా సంక్షోభం నుంచి ఫుడ్ డెలివరీ వ్యాపారం పుంజుకొందని వెల్లడించింది. అయితే..వృద్ధి ఒకే విధంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొవిడ్ – 19 మునుపటి స్థాయి స్థూల వ్యాపార విలువ (జీఎంవీ)తో పోలిస్తే…110 శాతంగా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఫుడ్ డెలివరీ సురక్షితమేనని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వివరించింది.మార్చిలో ప్రారంభమైన మొదటి లాక్ డౌన్ నుంచి 13 కోట్లకు పైగా ఆర్డర్లు చేశామంది. ఫుడ్ లేదా ప్యాకింగ్ ద్వారా ఒక్క కొవిడ్ – 19 కేసు నమోదు కాలేదని పేర్కొంది. టేక్ అవే సేవలపై కమిషన్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ..గత నెలలో The Federation of Hotel & Restaurant Associations of India (FHRAI) జొమాటో, స్విగ్గీ సంస్థలకు లేఖలు రాసింది. కమీషన్ ఛార్జీలను 5 శాతం తగ్గించాలని అసోసియేషన్ వారిని కోరింది.కమిషన్ రేట్లు సాధారణంగా ఇచ్చే ఫుడ్ ఆర్డర్ లో 18 నుంచి 40 శాతం మధ్య మారుతూ ఉంటాయి. కరోనా కారణంగా హోటల్ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో…అవుట్ లెట్లను మూసివేసి..టేక్ అవే, డెలివరీ వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. దేశ వ్యాప్తంగా 55 వేల రెస్టారెంట్లలలో టేక్ అవే సేవలున్నాయని అంచనా.

Related Tags :

Related Posts :