లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బిర్యానీ, పిజ్జాలు బాగా తినేశారు: 2020లో జొమోటోలో టాప్ ఆర్డర్ ఏంటో తెలుసా?

Published

on

2020సంవత్సరంలో కరోనా కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితిలో ఫుడ్ డెలివరీ యాప్‌లు ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఏడాది ఎక్కువగా జొమోటో యాప్ ద్వారా ఆర్డర్లు ఎక్కువగా సాగాయి. దానికి సంబంధించిన వివరాలు ఫుడ్ యాప్ జొమోటో ట్విట్టర్ ద్వారా పంచుకుంది. జోమోటో నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో ఆర్డర్లు.. బెంగళూరుకు చెందిన Yash అనే వ్యక్తి ఇచ్చారు. Yash ఈ సంవత్సరం 1,380 సార్లు జొమోటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. రోజుకు దాదాపు నాలుగు ఆర్డర్లు అతని అకౌంట్ నుంచి ఇచ్చేవారు. ఈ విషయాన్ని జొమోటో తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.

ఈ సంవత్సరం జొమోటోలో అతిపెద్ద ఆర్డర్ విలువ రూ.రెండు లక్షలు కాగా.. అతిచిన్న ఆర్డర్ 10రూపాయలు అని జొమోటో వెల్లడించింది. రెండు లక్షల ఆర్డర్‌పై వినియోగదారుడు 66వేల 650రూపాయలు ఆఫర్ పొందగా.. 10రూపాయల ఆర్డర్‌లో 39రూపాయలు ఆఫర్‌లో తగ్గింపు పొందారు.

2020లో జొమోటోలో ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకం ఏదైనా ఉందంటే.. అందులో మొదటి వరుసలో ఉన్న వంటకం బిర్యానీ. ఈ ఏడాది బిర్యానీనే మళ్ళీ ఎక్కువ ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచింది. ఈ సంవత్సరం, జోమాటోలో ప్రతి 22 నిమిషాలకు ఒక బిర్యానీ ఆర్డర్ వచ్చింది. 2020లో మొత్తం 1,988,094ఆర్డర్లు వెజ్ బిర్యానీకి సంబంధించి వచ్చాయి.

మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన ఓ జోమాటో యూజర్.. ఈ ఏడాది 369 పిజ్జాలను ఆర్డర్ చేశాడు. దేశవ్యాప్తంగా, పిజ్జా ఆర్డరు ‘మే’లో 4.5లక్షల నుంచి నవంబరుకు 17 లక్షలకు పెరిగింది.

ఈ ఏడాది 2020లో జొమోటోలో ఒక వ్యక్తి ప్రో మెంబర్‌షిప్ ద్వారా ఆర్డర్లు చేసి, లక్షా 94వేల 233రూపాయలకు సేవ్ చేశాడు. ఇదే ఈ ఏడాది అతనే ఎక్కువగా ఆదా చేసిన వ్యక్తి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *