మెగా బర్త్‌డే సందడి షురూ.. చిరుకి ‘జాంబీ రెడ్డి’ ట్రిబ్యూట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Chiranjeevi Birthday Trend: ‘అ!’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఇటీవల తన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ని ప్రకటించారు. తెలుగులో ఇది మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం.
తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ‘జాంబీ రెడ్డి’ టీమ్ ఒక్క రోజు ముందుగానే జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది.గధ పట్టుకుని ఫైటింగ్‌కు సిద్ధమవుతున్న హీరో షర్ట్ వెనకాల చిరంజీవి ఫొటో ఉంది. బ్యాగ్రౌండ్‌లో ‘దొంగ’ సినిమాలోని ‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో’ సాంగ్ బీజీఎం వినిపిస్తోంది.విభిన్న సినిమాలను తెరకెక్కించడానికి ఇష్టపడే ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’ కరోనా వైరస్‌పై కర్నూలు ప్రజలు ఎలా పోరాడారనే కథాంశంతో రూపొందబోతోంది. తొలి జాంబీ సినిమాగా కూడా నిలవబోతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Related Tags :

Related Posts :